Amit Shah: అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 1లోగా భక్తుల సందర్శనార్థం రామమందిరం సిద్ధం: అమిత్ షా

అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 1లోగా భక్తుల సందర్శనార్థం రామమందిరం సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. మరికొన్ని నెలల్లో త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, జన విశ్వాస్ యాత్రను ప్రారంభించి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. రామమందిర నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలకు వెళ్లిందని చెప్పారు.

Amit Shah: అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 1లోగా భక్తుల సందర్శనార్థం రామమందిరం సిద్ధం: అమిత్ షా

Every drug trafficker will be behind bars within.. says Amit Shah

Amit Shah: అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 1లోగా భక్తుల సందర్శనార్థం రామమందిరం సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. మరికొన్ని నెలల్లో త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, జన విశ్వాస్ యాత్రను ప్రారంభించి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. రామమందిర నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలకు వెళ్లిందని చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించారని అన్నారు. రాష్ట్రాన్ని ఉన్నత త్రిపుర, శ్రేష్ఠ త్రిపుర, సమృద్ధ త్రిపురగా తీర్చిదిద్దడానికి తాము జన విశ్వాస్ యాత్రను చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల తర్వాత త్రిపురలో కమ్యూనిస్టులు ఉండబోరని అన్నారు.

గతంలో త్రిపురలో ఏ పని చేయాలన్నా కమ్యూనిస్టుల అనుమతి తీసుకుని చేయాల్సి వచ్చేదని చెప్పారు. యువత అందరూ ఉద్యోగాలు పొందేలా త్రిపురను తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి మహిళ సురక్షితంగా ఉండేలా చేస్తామని, గిరిజనుల హక్కులను కాపాడతామని తెలిపారు.

ప్రతి గిరిజన కుటుంబానికి తాగు నీరు, వైద్యం అందేలా చేస్తామని హామీలు వచ్చారు. ఇప్పటికే మోదీ నేతృత్వంలో తమ నేతలు, మాజీ సీఎం బిప్లవ్ దేవ్, సీఎం మాణిక్ సాహా రైల్వే, ఇంటర్నెట్, హైవేలు, ఎయిర్ వేలు వంటి అనేక హామీలను నెరవేర్చారని ఆయన అన్నారు. కాగా, అయోధ్య రామమందిరం 2023 డిసెంబరులో లేదా 2024 సంక్రాంతికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని గతంలోనూ పలుసార్లు రామజన్మభూమి మందిర్‌ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులు చెప్పారు.

Delhi: రోడ్డుపై సంగీత కళాకారుడిని నిలువరించిన ఢిల్లీ పోలీస్.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు