రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ప్రకటించిన కేంద్రం

రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలను ప్రకటించిన కేంద్రం

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషన్, 16 మందికి పద్మ భూషన్, 118మందికి పద్మ శ్రీ అవార్డులు ఇచ్చారు. 

జగదీశ్ లాల్ అహూజా(లంగర్ బాబా): నిస్వార్థంగా రెండు దశాబ్దాలుగా పేదవారికి ఉచిత భోజనం పెడుతున్నాడు. ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు దుప్పట్లు, బట్టలు ఇస్తున్నాడు. భారతదేశానికి వట్టి చేతులతో వలస వచ్చి బిలీయనీర్ గా ఎదిగాడు. ఆస్తులు అమ్మి పేదలకు సేవ చేస్తున్నాడు.

జావేద్ అహ్మద్ తక్: దివ్యాంగులకు రెండు దశాబ్దాలుగా సాయం అందిస్తున్నాడు. వెన్నెముకకు చికిత్స చేయించుకుని రెండు దశాబ్దాలుగా వీల్ చైర్ లోనే కాలం వెల్లదీస్తున్నాడు. 

మొహ్మద్ షరీఫ్(చాచా షరీఫ్): సైకిల్ మెకానిక్.. 25సంవత్సరాలుగా అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. దాదాపు 25వేల శవాలకు మతాల బట్టి అంత్యక్రియలు పూర్తిచేశాడు. 

వీరితో పాటు పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన ప్రముఖులు

ఉషా చమర్ సామాజిక కార్యకర్త, పారిశుధ్యం
పోపట్ రావ్ పవార్ మహారాష్ట్ర, నీటిపారుదల సామాజిక కార్యకర్త
హరేకాల హజబ్బా కర్నాటక విద్యాబోధన, సామాజిక కార్యకర్త
అరుణోదయ మండల్ పశ్చిమ బెంగాల్ వైద్య సేవలు
రాధా మోహన్ ఒడిశా సేంద్రియ వ్యవసాయం
కుశల్ కన్వర్ శర్మ అస్సాం వెటర్నరీ డాక్టర్
ట్రినిటీ సాయో మేఘాలయ సేంద్రీయ వ్యవసాయం
రవి కన్నన్ అసోం వైద్య రంగం
ఎస్. రామకృష్ణన్ తమిళనాడు దివ్యాంగుల సంక్షేమం, సామాజిక కార్యకర్త
సుందరం వర్మ రాజస్థాన్ భజన కీర్తనల గాయకుడు
యోగి ఆరోన్ ఉత్తరాఖండ్ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు
రహీబాయి సోమా పోపరే మహారాష్ట్ర సేంద్రీయ వ్యవసాయం
హిమ్మట రాంబాబు రాజస్థాన్ పర్యావరణం సామాజిక కార్యకర్త
మూజిక్కర్ పంకజాక్షి కేరళ తోలుబొమ్మలాట కళాకారిణి.