UP elections: తండ్రిని గెలిపించాలని ఏడేళ్ల చిన్నారి ఎన్నికల ప్రచారం

గౌరీ పాండే.. ఏడేళ్ల చిన్నారి.. ఆడుకునే వయస్సులెమ్మని లైట్ తీసుకోవద్దు. తండ్రి రాజకీయ భవిష్యత్ కోసం ఇప్పుడే నడుం బిగించింది.

UP elections: తండ్రిని గెలిపించాలని ఏడేళ్ల చిన్నారి ఎన్నికల ప్రచారం

Up Elections

UP elections: గౌరీ పాండే.. ఏడేళ్ల చిన్నారి.. ఆడుకునే వయస్సులెమ్మని లైట్ తీసుకోవద్దు. తండ్రి రాజకీయ భవిష్యత్ కోసం ఇప్పుడే నడుం బిగించింది. తన తండ్రి తేజ్ నరైన్ పాండే(పవన్ పాండే)కు అయోధ్య నుంచి పోటీ చేసేందుకు సమాజ్ వాద్ పార్టీ టిక్కెట్ ఇప్పించాలని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది.

ఉదయం 7గంటలకే ప్రతి ఇంటికి తిరిగి తన తండ్రికి ఓటు వేయాలని అడుగుతుంది. కొందరు మహిళలతో కలిసి, అప్పుడప్పుడు తల్లిని తీసుకుని వెళ్లి ప్రచారంలో పాల్గొంటుంది. మూడో తరగతి చదువుతున్న ఈ చిన్నారి… ఉదయం రెండు గంటల పాటు ప్రచారం చేసి స్కూల్ కు వెళ్లి మళ్లీ సాయంత్రం రెండు గంటల పాటు ప్రచారం చేస్తుంది.

ఆమె ప్రచారంలో చెప్పే మాట ఇదే. ‘నా తండ్రికి మీరు ఓటు వేస్తే.. అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారని’ చెప్తూ ఓట్లు అడుగుతుంది.

ఇది కూడా చదవండి : 68 మంది సీబీఐ సిబ్బందికి కరోనా

తేజ్ నరైన్ పాండే(పవన్ పాండే) ఒక మాజీ స్టూడెంట్ లీడర్. అయోధ్య నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి ప్రత్యర్థి అయిన లల్లూ సింగ్ ను ఓడించారు. ప్రస్తుతం లల్లూ సింగ్ ఫైజాబాద్ ఎంపీ.