Gang Rape On Widow : పెన్షన్ ఇప్పిస్తానని వితంతుపై అత్యాచారం

రాను రాను మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.. దేశంలో ఎదో ఓ చోట ప్రతి రోజు మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ విషయంలో ఇంట్లో వారిని కూడా నమ్మే పరిస్థితి లేకుండా తయారైంది. రక్షణ కల్పించాల్సిన సోదరులే తోడబుట్టిన వారిపై అఘాయిత్యాలు చేస్తున్నారు.

Gang Rape On Widow : పెన్షన్ ఇప్పిస్తానని  వితంతుపై అత్యాచారం

Gang Raped On Widow

Gang Raped On Widow: రాను రాను మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.. దేశంలో ఎదో ఓ చోట ప్రతి రోజు మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ విషయంలో ఇంట్లో వారిని కూడా నమ్మే పరిస్థితి లేకుండా తయారైంది. రక్షణ కల్పించాల్సిన సోదరులే తోడబుట్టిన వారిపై అఘాయిత్యాలు చేస్తున్నారు.

పనిచేసే ఆఫీసుల్లో, చదువుకునే కాలేజీల్లో, స్కూళ్లల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన స్త్రీలు ఎలాంటి సమాజనంలో బతుకుతున్నారన్నది తెలియచేస్తుంది. కొద్దీ నెలల క్రితం భర్త చనిపోవడంతో వితంతు పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళింది.. అక్కడ పరిచయమైన ఓ యువకుడు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు..

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శమాబల్ జిల్లాలోని అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని నఖాశా గ్రామానికి చెందిన ఓ మహిళకు కొద్దీ నెలల క్రితం భర్త చనిపోయాడు. దీంతో ఆమె వితంతు పెన్షన్ కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళింది.

అక్కడ ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వితంతువులకు ప్రధాని మోడీ ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నదంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. తానూ ఆ డబ్బు వచ్చేలా చేస్తానని నమ్మబలికాడు.. ఈ సమయంలోనే తన మిత్రుడిని సదరు మహిళకు పరిచయం చేశాడు. డబ్బు రావాలంటే మొదట పేపర్ వర్క్ ఉంటుందని అందుకోసం రూ.5000 ఖర్చు అవుతుందని అవి ఇవ్వాలని అడిగారు.. అయితే తన వద్ద అంత డబ్బు లేదని రెండు వేలు ఇస్తానని తెలిపింది.

రెండు వేలు తీసుకున్న ఇద్దరు యువకులు పలు మార్లు ఆమెకు కార్యాలయం చుట్టూ తిప్పారు. ఈ నేపథ్యంలోనే అధికారి దగ్గర సంతకం పెట్టాలని చెప్పి బైక్ పై ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు అంతటితో ఆగకుండా వీడియో తీశారు. ఎవరికైనా చెబితే వీడియోలు బయట పెడతామని బెదిరించారు.. ఇలా అనేక సార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆ ఇద్దరు యువకులు.. వారి బాధ భరించలేక సదరు మహిళ అస్మోలీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది..

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. యువకుల సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు… అఘాయిత్యం జరిగిన మాట వాస్తవమే అని తేల్చారు. యువకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు