వాలెంటైన్స్ డే బంపరాఫర్ : రూ.999కే విమాన టిక్కెట్టు

వాలెంటైన్స్ డే సందర్భంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది.

  • Edited By: veegamteam , February 12, 2020 / 03:16 AM IST
వాలెంటైన్స్ డే బంపరాఫర్ : రూ.999కే విమాన టిక్కెట్టు

వాలెంటైన్స్ డే సందర్భంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది.

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకొని ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది. వాలెంటైన్స్ డే స్పెషల్ ఇండిగో ఎయిర్‌లైన్స్ సేల్ ఫిబ్రవరి 11న ప్రారంభమైంది. ఈ సేల్ ఫిబ్రవరి 14న ముగుస్తుంది.

పది లక్షల సీట్లు కేటాయింపు
ఈ నెల 14 లోపు అమలులో ఉండనున్న ఈ ఆఫర్‌ కింద పది లక్షల సీట్లను కేటాయించింది. ఈ ఆఫర్‌ కింద బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు మార్చి 1 నుంచి సెప్టెంబర్‌ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రేమికుల దినోత్సవం కంటే ముందుగానే ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ అధికారి విలియన్‌ బౌల్టర్‌ తెలిపారు. 

టికెట్టు ప్రారంభ ధర రూ.999 
ఆఫర్ ధర రూ.999 నుంచి మొదలవుతుంది. ఆఫర్ సేల్‌ కోసం 10 లక్షల సీట్లను కేటాయించింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి ఈఎంఐ పేమెంట్స్ చేస్తే రూ.5,000 వరకు 12% క్యాష్‌బ్యాక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేజ్ యాప్‌తో టికెట్లు బుక్ చేస్తే రూ.1000 వరకు 15% క్యాష్‌బ్యాక్, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డుతో పేమెంట్ చేస్తే రూ.1500 వరకు 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

కార్పొరేట్ కస్టమర్లతో పాటు విహారయాత్రలకు వెళ్లే ప్రయాణికులు
కార్పొరేట్ కస్టమర్లతో పాటు విహారయాత్రలకు వెళ్లే ప్రయాణికులు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఇండిగో ప్రకటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లైట్ టికెట్ ఆఫర్ ధర రూ.999 నుంచి మొదలవుతున్నా… హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి వెళ్లే ఇండిగో ఫ్లైట్లలో రూ.999 ధరకు టికెట్లు అందుబాటులో లేవు. హైదరాబాద్ నుంచి కనీస టికెట్ ధర రూ.1599. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లేందుకు తక్కువ ధరలో అందుబాటులో ఉన్న టికెట్ ఇదే.

* హైదరాబాద్ నుంచి చెన్నై..రూ.1599
*హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్, బెంగళూరు..రూ.1699
*హైదరాబాద్ నుంచి ముంబై..రూ.1799
*హైదరాబాద్ నుంచి విజయవాడ, గోవా, అహ్మదాబాద్..రూ.1999
*హైదరాబాద్ నుంచి సూరత్..రూ.2099
*హైదరాబాద్ నుంచి తిరుపతి..రూ 2399