Shivamogga: ఇరువర్గాల మధ్య ఫ్లెక్స్ తెచ్చిన వివాదం.. శివమొగ్గలో 144 సెక్షన్

ఒక వర్గం వాళ్లు వీర్ సావర్కర్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంతో మరో వర్గం వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చివరికి పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Shivamogga: ఇరువర్గాల మధ్య ఫ్లెక్స్ తెచ్చిన వివాదం.. శివమొగ్గలో 144 సెక్షన్

Shivamogga: ఇరువర్గాల మధ్య కర్ణాటకలోని శివమొగ్గలో ఒక ఫ్లెక్స్ కారణంగా వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున శివమొగ్గలో ఒక వర్గానికి చెందిన వాళ్లు వీర్ సావర్కర్ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు.

Nitish Kumar: నేడు బిహార్ క్యాబినెట్ విస్తరణ.. ఆర్‌జేడీకే ఎక్కువ స్థానాలు

స్థానిక అమీర్ అహ్మద్ సర్కిల్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్స్ విషయంలో మరోవర్గం వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అక్కడ టిప్పు సుల్తాన్ ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అప్పటికే ఏర్పాటు చేసిన వీర్ సావర్కర్ ఫ్లెక్స్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అక్కడ ఫ్లెక్స్ ఏర్పాటు చేసిన వాళ్లు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి, ఇరువర్గాల్ని చెదరగొట్టారు. అక్కడ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, అదనపు బలగాల్ని మోహరించారు. 144 సెక్షన్ విధించారు. దీని ప్రకారం ఆ ప్రాంతంలో నలుగురికంటే ఎక్కువ మంది గుమిగూడటానికి వీల్లేదు.

Indraja : పెద్ద బ్యానర్స్ అడిగినప్పుడు స్పెషల్ సాంగ్స్ ఒప్పుకోక తప్పదు.. ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను..

చివరకు ఆ ఫ్లెక్స్ స్థానంలో పోలీసులు జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. మంగళూరులో కూడా ఇటీవల ఇలాంటి వివాదమే తలెత్తింది. స్థానిక సూరత్‌కాల్ జంక్షన్ వద్ద ఒక వర్గం ఫ్లెక్స్ ఏర్పాటు చేసింది. అందులో ఆ సర్కిల్ పేరును వీర్ సావర్కర్ జంక్షన్‌గా పేర్కొన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. మంగళూరు సిటీ కార్పొరేషన్ అధికారులు ఆ ఫ్లెక్స్ తొలగించారు.