Nitish Kumar: నేడు బిహార్ క్యాబినెట్ విస్తరణ.. ఆర్‌జేడీకే ఎక్కువ స్థానాలు

బిహార్‌లో నేడు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మొత్తం 31 మందికి సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అత్యధికంగా ఆర్‌జేడీకి 16 మంత్రి స్థానాలు దక్కే అవకాశాలున్నాయి.

Nitish Kumar: నేడు బిహార్ క్యాబినెట్ విస్తరణ.. ఆర్‌జేడీకే ఎక్కువ స్థానాలు

Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు తన మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 31 మంది మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. ఇటీవలే బీజేపీతో పొత్తుకు స్వస్తి పలికిన సీఎం నితీష్ కుమార్.. ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Uorfi Javed : రెండేళ్లుగా వేధిస్తున్నాడు.. పోలీసులకి చెప్పినా పట్టించుకోవడంలేదు.. సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ పోస్ట్

ఈ నెల 10న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం బిహార్ ప్రభుత్వంలో అధిక సీట్లున్న పార్టీ ఆర్‌జేడీ. అందువల్ల ఆ పార్టీకే మంత్రివర్గంలో ఎక్కువ సీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఈ పార్టీకి 16 మంత్రి స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. ఆ తర్వాత నితీష్ కుమార్ పార్టీ జేడీ (యూ)కు 11 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. అధికారంలో భాగమైన హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎమ్) పార్టీకి ఒక మంత్రి స్థానం, కాంగ్రెస్ పార్టీకి మరో రెండు మంత్రి స్థానాలు దక్కుతాయని విశ్లేషకుల అంచనా. సుమిత్ కుమార్ సింగ్ అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

Governor Tea Dinner CM KCR Absent : రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తేనీటి విందు..సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరు

ఇదే జరిగితే నాలుగు పార్టీలతోపాటు, ఒక స్వతంత్ర అభ్యర్థికి స్థానం దక్కిన మంత్రివర్గం నితీష్ కుమార్‌దే అవుతుంది. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికే ఎక్కువ స్థానాలు దక్కుతున్నాయి. అయితే, ఓబీసీ, దళిత నేతలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు చోటుండాలని నితీష్, తేజస్వి నిర్ణయించారు. ఏ-జడ్ నినాదంతో అందరికీ చోటు దక్కేలా చూస్తున్నారు.