సెహ్వాగ్ సేవాగుణం: వీరజవాన్ల పిల్లలను చదివిస్తా

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారత మాజీ క్రికెటర్, ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చాడు.

  • Edited By: sreehari , February 16, 2019 / 01:52 PM IST
సెహ్వాగ్ సేవాగుణం: వీరజవాన్ల పిల్లలను చదివిస్తా

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారత మాజీ క్రికెటర్, ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చాడు.

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చాడు. అమరులైన జవాన్ల పిల్లలను తానే చదివిస్తానని హామీ ఇచ్చిన వీరూ.. దేశం పట్ల తనకు ఉన్న సేవాగుణాన్ని చాటుకున్నాడు. జవాన్ల పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సెహ్వాగ్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. గురువారం (ఫిబ్రవరి 15, 2019) జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాల్లో ఉగ్రదాడులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 40మంది వరకు భారత జవాన్లు వీరమరణం పొందారు.

పలువురు జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. జవాన్లపై ఉగ్రదాడి ఘటనను సెహ్వాగ్ తీవ్రంగా ఖండించాడు. ‘‘ఊహించని దారుణం జరిగిపోయింది. ఉగ్రదాడిలో మన జవాన్లు నెలకొరిగారు. దేశం కోసం అమరులైన జవాన్లను తిరిగి ఎలాగో తీసుకరాలేం. కనీసం వారి కుటుంబాలనునైనా ఆదుకుందాం. పుల్వామాలో వీరజవాన్ల కుటుంబంలోని పిల్లల చదువుకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. నా సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జవాన్ల పిల్లలను చదివిస్తాను’’ అని ట్వీట్ చేశాడు. మరోవైపు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ హర్యానా పోలీసుగా తనకు వచ్చే నెల జీతాన్ని జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. 

Read Also :  పుల్వామా దాడి ఎఫెక్ట్ : పాక్ పర్యటన రద్దు చేసుకున్న చౌతాలా

Read Also :  అసలు తప్పెక్కడ: పుల్వామా దాడిపై సిద్దు ఏమన్నాడు?