యూజర్ల నుంచి రూ.99 కట్ చేసి క్షమాపణ అడిగిన Vodafone 

  • Published By: Subhan ,Published On : June 2, 2020 / 09:37 AM IST
యూజర్ల నుంచి రూ.99 కట్ చేసి క్షమాపణ అడిగిన Vodafone 

చాలా మంది వొడాఫోన్ యూజర్లు ట్విట్టర్‌లో రూ.99 పోయినాయంటూ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. మంగళవారం అకౌంట్ హోల్డర్లు తమ అకౌంట్ లో నుంచి ఇంటర్నేషనల్ రోమింగ్ ఛార్జీలు అంటూ డబ్బులు కట్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలలుగా ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీయే లేని వాళ్ల అకౌంట్ నుంచి ఎలా కట్ చేస్తారంటూ కంప్లెంట్ చేస్తున్నారు. 

‘ఇంటర్నేషనల్ రోమింగ్ పేరిట రూ.99లు కట్ చేశారు. నేను దాని గురించి అడగలేదు. నిజయతీగా చెప్పాలంటే వొడాఫోన్ చెత్త సర్వీసు ఇస్తుంది. ఎవరైనా నిజంగా కస్టమర్ సపోర్ట్ అందుకోగలిగారా’ అని వొడాఫోన్ కస్టమర్ అసంతృప్తి వ్యకం చేశారు. 

ఈ ట్వీట్లను బట్టి యూజర్ అకౌంట్ల నుంచి రూ.99లు సోమవారం ఉదయం కట్ అయ్యాయి. యూజర్లంతా సోషల్ మీడియాలో చేస్తున్న ట్వీట్లపై స్పందించింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ అకౌంట్లకు అదే అమౌంట్ క్రెడిట్ చేస్తున్నాం. మీ కోపరేషన్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నా. స్టే హోమ్.. స్టే వేస్ అని ట్వీట్ రూప్ వినియోగరాలకు సూచనలు ఇస్తుంది Vodafone.

Read: పదకొండు నంబర్లు కావు.. ట్రాయ్ ప్రకటన