SBI OTP Scam : ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లను సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలర్ట్ చేశారు. OTP స్కామ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

SBI OTP Scam : ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం

Sbi Otp Scam

SBI OTP Scam : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లను సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలర్ట్ చేశారు. ఓటీపీ స్కామ్ ముప్పు పొంచి ఉందని కస్టమర్లను హెచ్చరించారు. చైనాకు చెందిన హ్యాకర్లు ఎస్బీఐ కస్టమర్లపై కన్నేశారు. కేవైసీ అప్ డేట్ పేరుతో బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ చేస్తున్నారు. హ్యాకర్లు ఓ వెబ్ సైట్ లింక్ పంపుతారు. కేవైసీ అప్ డేట్ చేయాలని కోరతారు. అంతేకాదు బ్యాంకు నుంచి రూ.50లక్షలు ఉచిత కానుకలు వస్తాయని ఆశ పెడతారు. వాట్సాప్ మేసేజ్ ద్వారా సందేశాలు పంపుతారు. అలాంటి మేసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు.

ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న థింక్ ట్యాంక్ సైబర్ పీస్ ఫౌండేషన్ రీసెర్చ్ వింగ్, ఆటోబోట్ ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్.. ఎస్బీఐ పేరుతో కొంతమంది స్మార్ట్ ఫోన్ యూజర్లు మోసపోయిన ఘటనల గురించి తెలుసుకున్నారు. డొమైన్ పేర్లన్నీ చైనా పేరుతో ఉన్నట్టు వారు గుర్తించారు. ఎస్బీఐ అఫిషియల్ ఆన్ లైన్ పేజీని తలపించే వెబ్ సైట్ నుంచి కేవైసీ వెరిఫికేషన్ పేరుతో ఓ వ్యక్తికి మేసేజ్ వచ్చింది.

కంటిన్యూ టు లాగిన్ పై క్లిక్ చేసి కేవైసీ నింపాలని అందులో ఉంది. అక్కడ కాన్ఫిడెన్షియల్ సమాచారం అయిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ అడిగింది. వాటిని ఎంటర్ చేసి ఆన్ లైన్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అవ్వాలని ఉంది. ఆ తర్వాత యూజర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ యూజర్ తన పేరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఆ వివరాలు ఇచ్చాక యూజర్ ను ఓటీపీ పేజ్ కి రీడైరెక్ట్ చేస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశామో ఇక అంతే..మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. ఇలా హ్యాకర్లు చీట్ చేస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. అఫిషియల్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సైట్ పేజీ ఎలా ఉంటుందో అచ్చం అలానే హ్యాకర్లు డూప్లికేట్ పేజ్ ని డిజైన్ చేశారు.

కేవైసీ అప్ డేట్, ఓటీపీ పేరుతో వచ్చే మేసేజ్ ల పట్ల ఎస్బీఐ కస్టమర్లు అలర్ట్ గా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా చేసే ముందు ఒకసారి బ్యాంకు అధికారులను సంప్రదించాలని, క్రాస్ చెక్ చేసుకోవడం మంచిదన్నారు.