నెహ్రూనే కారణం : రాహుల్ ట్వీట్ కు బీజేపీ ఘాటు రిప్లై

  • Published By: venkaiahnaidu ,Published On : March 14, 2019 / 12:24 PM IST
నెహ్రూనే కారణం : రాహుల్ ట్వీట్ కు బీజేపీ ఘాటు రిప్లై

జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని ఐక్యరాజ్యసమితిలో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించుకుండా చైనా అడ్డుకోవడంలో దేశంలో రాజకీయ వివాదాలకు తెరలేపింది. చైనా విషయంలో కాంగ్రెస్,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా అధ్యక్ష్యుడు జిన్ పింగ్ ను చూసి ప్రధాని నరేంద్రమోడీ భయపడుతున్నాడని,మోడీ చాలా బలహీనమైన వ్యక్తి అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
Read Also : కాపురంలో ‘దున్నపొతు’ చిచ్చు.. భార్య కాళ్లను నరికేసిన భర్త

మూసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకుంటే మోడీ నోటి నుంచి ఒక్క పదం కూడా బయటకి రాలేదని రాహుల్ ట్వీట్ చేశారు. చైనాతో నమో(మోడీని ఉద్దేశిస్తూ) దౌత్య సంబంధం ఎలాంటిదంటే.. 1. గుజరాత్ లో జిన్ పింగ్ తో కలిసి పర్యటిస్తారు.2. ఢిల్లీలో జిన్ పింగ్ ను హగ్ చేసుకుంటారు.3. చైనాలో జిన్ పింగ్ ముందు తలవంచుతారు అని రాహుల్ ట్వీట్ చేశారు.

రాహుల్ విమర్శలపై బీజేపీ కూడా అదేస్థాయిలో కౌంటర్లు ఇచ్చింది. అసలు మీ ముత్తాతే (నెహ్రూ) చైనాకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థానాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. భారత్ కు రావాల్సిన ఆ స్థానాన్ని మీ ముత్తాత నెహ్రూనే చైనాకు ఇచ్చారు. మీ కుటుంబం చేసిన తప్పులనే భారత్ ఇప్పుడు అనుభవిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ఆ పని మోడీకి వదిలేసి మీరు చైనా రాయబారులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించుకుంటూ ఉండండి అంటూ బీజేపీ రాహుల్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ఘాటు రిప్తై ఇచ్చింది.