Elon Musk: ఎలాన్ మస్క్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డబ్ల్యూహెచ్ఓ అధినేత

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్, ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది. మస్క్ డబ్ల్యూహెచ్ఓను ఉద్దేశించి ట్వీట్ చేయగా.. అధనామ్ ట్విటర్ వేదికగా మస్క్ పేరు ప్రస్తావించకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Elon Musk: ఎలాన్ మస్క్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డబ్ల్యూహెచ్ఓ అధినేత

Elon Musk

Updated On : March 24, 2023 / 2:45 PM IST

Elon Musk: ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవలి కాలంలో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్.. ఉద్యోగుల తొలగింపు, ట్విటర్‌లో బ్లూటిక్‌ అంశం.. ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు.. అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్లుచేస్తూ విమర్శలపాలవుతున్నాడు. తాజాగా, ట్విటర్‌లో ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ను ఉద్దేశించి మస్క్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో మస్క్ పేరెత్తకుండా డబ్ల్యూహెచ్ఓ అధినేత టెడ్రోస్ అధనామ్ (Tedros Adhanom) ఘాటుగా స్పందించారు. మస్క్ పేరు ప్రస్తావించకుండానే చురకలు అంటించారు.

Elon Musk..Silicon Valley Bank : సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత .. కొనటానికి నేను రెడీ అంటున్న ఎలన్ మస్క్

భవిష్యత్తు మహమ్మారులను నిరోధించడం, వాటి విషయంలో వేగంగా స్పందించే ఉద్దేశంతో దేశాల మధ్య కొత్త ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ డబ్ల్యూహెచ్ఓకు వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు దేశాలు తమ సార్యభౌమాధికారాన్ని అప్పగించొద్దు అంటూ మస్క్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. అంటే, కరోనా సమయంలో డబ్ల్యూహెచ్ఓ సరియైన సమయంలో స్పందించక పోవటం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొంటూ మస్క్ ట్వీట్ చేసినట్లుంది. మస్క్ ట్వీట్ కు డబ్ల్యూహెచ్ఓ అధినేత టెడ్రోస్ అధనామ్ ఘాటుగా స్పందించాడు. మస్క్ పేరు ప్రస్తావించకుండా కీలక వ్యాఖ్యలు చేశారు.

Elon Musk Bodyguards : భయంభయంగా మస్క్.. బాత్‌రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు ఉండాల్సిందే.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

నకిలీ వార్తలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డబ్ల్యూహెచ్ఓ కు దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని అప్పగించడం లేదని అన్నారు. కేవలం మహమ్మారులను సమర్థవంతంగా అడ్డుకోవడానికి మాత్రమే ఇది ఉపకరిస్తుందని తెలిపారు. ప్రజలు పేద, ధనిక దేశంలో నివసిస్తున్నారా? అనే దానితో సంబంధం లేకుండా వారిని రక్షించేందుకు ఇది సాయపడుతుందని ట్రెడోస్ అధనామ్ సమాధానం ఇచ్చారు.