Unlike humans : మానవత్వం ఎక్కడ : మాటల్లేవు..జంతువెవరో అర్థం కావడం లేదు

అడవి జంతువుల నుంచి మనషులకు జరిగే నష్టం కంటే.. మనుషుల నుంచి జంతువులకు జరిగే నష్టమే అధికం.

Unlike humans : మానవత్వం ఎక్కడ : మాటల్లేవు..జంతువెవరో అర్థం కావడం లేదు

Human

elephant goes viral : అడవి జంతువుల నుంచి మనషులకు జరిగే నష్టం కంటే.. మనుషుల నుంచి జంతువులకు జరిగే నష్టమే అధికం. ఆకలితోనో, దాహంతోనో ఊర్ల బాట పట్టిన జంతువులను దారుణంగా హింసించి తరిమేస్తున్నారు మనుషులు. గుంపులు గుంపులుగా జనం ఏనుగును వెంటాడుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సుధా రామెన్‌ అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

మాటల్లేవు.. ఇక్కడ జంతువెవరో అర్థంకావటం లేదని వీడియోకు క్యాప్షన్‌ పెట్టారు ఆ ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌. మనుషుల మానవత్వం లేని చర్యల వల్ల జంతువులు ఇలా ఒత్తిడికి గురవుతున్నాయని, దీనికి మానవత్వం పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదని తెలిపారామె. కాగా.. ఆ వీడియోలో.. రాత్రి వేళ ఓ ఏనుగు రోడ్డుపై పరిగెడుతూ ఉంటే.. దాని వెనకాల గుంపులు గుంపులుగా జనం గట్టిగా అరుస్తూ, తరుముతూ ఉన్నారు. దీంతో ప్రాణభయంతో ఆ ఏనుగు పరుగులు తీసింది.

ఈ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపోతున్నారు. మనుషులు మానవత్వం మరిచిపోయి క్రూరులుగా మారుతున్నారని కామెంట్స్‌ పెడుతున్నారు. మూగ జీవాలను రక్షించాల్సింది పోయి.. వాటిని చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జంతు ప్రేమికులు.