ఆ సీఎంకు.. కారు డ్రైవర్ నుంచి సెక్యూరిటీ వరకు అందరూ మహిళలే

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు అరుదైన గౌర‌వం ఇచ్చింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు అర్హ‌త గ‌ల మ‌హిళ‌ల‌ను సెక్యూరిటీగా నియ‌మించింది. సీఎం ప్ర‌యాణించే కారు డ్రైవ‌ర్ కూడా మ‌హిళే కావ‌డం విశేషం. సీఎంకు ర‌క్ష‌ణ‌గా ఉన్న మ‌హిళ‌లంద‌రూ ఒకే యూనిఫాం ధ‌రించి.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ఆ సీఎంకు.. కారు డ్రైవర్ నుంచి సెక్యూరిటీ వరకు అందరూ మహిళలే

Women security personnel and driver for CM: నేడు(మార్చి 8,2021) అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం. దీన్ని పురస్కరించుకుని (మార్చి 8,2021) మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు అరుదైన గౌర‌వం ఇచ్చింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు అర్హ‌త గ‌ల మ‌హిళ‌ల‌ను సెక్యూరిటీగా నియ‌మించింది. సీఎం ప్ర‌యాణించే కారు డ్రైవ‌ర్ కూడా మ‌హిళే కావ‌డం విశేషం. సీఎంకు ర‌క్ష‌ణ‌గా ఉన్న మ‌హిళ‌లంద‌రూ ఒకే యూనిఫాం ధ‌రించి.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

మ‌హిళా దినోత్స‌వాన సీఎం శివ‌రాజ్‌సింగ్ సోమవారం ఉద‌యం పారిశుద్ధ్య కార్మికుల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. సీఎం కూడా చీపురు ప‌ట్టి ఊడ్చి కార్మికుల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసానిచ్చారు.