ఆ ఎయిర్ పోర్టులో మహిళలే ట్యాక్సీ డ్రైవర్లు!

ఐటీ రాజధాని బెంగుళూరు ఎయిర్ పోర్టులో మంగళవారం నుంచి మహిళా ట్యాక్సీ క్యాబ్ సర్వీసులు  అందుబాటు లోకి వచ్చాయి.

  • Published By: chvmurthy ,Published On : January 8, 2019 / 07:59 AM IST
ఆ ఎయిర్ పోర్టులో మహిళలే ట్యాక్సీ డ్రైవర్లు!

ఐటీ రాజధాని బెంగుళూరు ఎయిర్ పోర్టులో మంగళవారం నుంచి మహిళా ట్యాక్సీ క్యాబ్ సర్వీసులు  అందుబాటు లోకి వచ్చాయి.

బెంగుళూరు: ఐటీ రాజధాని బెంగుళూరు ఎయిర్ పోర్టులో మంగళవారం నుంచి మహిళా ట్యాక్సీ క్యాబ్ సర్వీసులు  అందుబాటు లోకి వచ్చాయి.  నగరంలో  మహిళా ప్రయాణికులకు  భద్రత కల్పించే ఉద్దేశంతో బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృధ్ది సంస్ధల సహాకారంతో  మహిళల కోసం మహిళలే నడిపే ట్యాక్సీలను ప్రవేశ పెట్టారు. ఈ సేవలను సీఈఓ హరిమరార్‌, కేఎస్ టీడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ కుష్కర్‌లు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిమరార్‌ మీడియాతో మాట్లాడుతూ పగటిపూట ఈ సేవలకు కిలోమీటరుకు రూ.21.50 చొప్పున, రాత్రివేళల్లో రూ.23.50 చొప్పున చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు.

ఈ ట్యాక్సీలలో డ్రైవర్‌లుగా సేవలందించే మహిళలు హిందీ, ఇంగ్లీషు తోపాటు అన్ని దక్షిణాది భాషలలో ప్రావీణ్యం కలిగి ఉంటారని ఆయన చెప్పారు. ఉమెన్‌ ఓన్లీ ట్యాక్సీలు ప్రారంభించిన తొలిరోజే ప్రయాణికులనుంచి అనూహ్యస్పందన లభించింది. పింక్ క్యాబ్స్ గా పిలిచే  ఈక్యాబ్స్ లో డ్రయివర్లుగా ఎయిర్ పోర్టు చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళా డ్రయివర్లను  రిక్రూట్ చేసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా క్యాబ్స్ కు GPS సిస్టం అమర్చారు.