Weekly 4 days: వారానికి 4 రోజులే పని..! కొత్త లేబర్ కోడ్

కాంపీటిషన్ ప్రపంచంలో మనిషి తన జీవిత కాలంలో సగం సమయానికిపైగా ఆఫీస్ అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇళ్లకు, ఇంటి పనులకు వారంలో ఐదు/ఆరు రోజుల పాటు ఆఫీసుల్లో జాబ్‌ చేస్తూ..

Weekly 4 days: వారానికి 4 రోజులే పని..! కొత్త లేబర్ కోడ్

New Labour Code

Weekly 4 days: కాంపీటిషన్ ప్రపంచంలో మనిషి తన జీవిత కాలంలో సగం సమయానికిపైగా ఆఫీస్ అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇళ్లకు, ఇంటి పనులకు వారంలో ఐదు/ఆరు రోజుల పాటు ఆఫీసుల్లో జాబ్‌ చేస్తూ వ్యక్తిగత జీవితానికి దూరమైపోతున్నారు. మరింత సమయాన్ని వెచ్చిస్తేనే కాంపిటీషన్ లో నిలబడతాం. ఈ క్రమంలోనే ఉద్యోగుల్లో ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతుంది. ఒత్తిడిని తగ్గించి.. ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు కార్యాలయాల్లో వారానికి 4 రోజుల పని విధానాన్ని ప్రవేశపెడితే ఉపయోగపడుతోందని సర్వేలో వెల్లడైంది.

ఇంట్లో, ఆఫీసుల్లో ఒత్తిడి లేని, ఆహ్లాదకరంగా గడిపేందుకుగాను కంపెనీలు వారంలో 4రోజుల పనివిధానం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. భారత్‌లోని ఉద్యోగులు వారానికి 4 రోజుల పాటు డ్యూటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ఓ సర్వే తెలిపింది. ఇలా భారత్‌లోని 60 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నాయట.

1,113 కంపెనీలు పాల్గొన్న సర్వేను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7 వరకు జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ బీపీవో, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన కంపెనీలు ఈ సర్వేలు పాల్గొన్నాయి.

Read Also : కేంద్రం కీలక నిర్ణయం.. విదేశాల నుంచి వస్తే 7 రోజులు తప్పనిసరి హోం క్వారంటైన్

వారానికి 4 రోజుల పని మాత్రమే చేస్తే.. ప్రొడక్టివిటీలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావించాయి. 27 శాతం కంపెనీలు తటస్థంగా ఉన్నప్పటికీ.. 11 శాతం కంపెనీలు నాలుగు రోజుల పనిదినాలతో ఉత్పాదకతో గణనీయమైన మార్పులు వస్తాయని భావిస్తున్నారు. నాలుగు రోజుల పని మాత్రమే కాకుండా.. రోజుకు 12 గంటల వరకు పనిచేసేందుకు సిద్దమని ఉద్యోగులు తెలిపారు.

సర్వేలో పాల్గొన్న 52 శాతం కంపెనీలు, శుక్రవారం మూడో సెలవు ఉంటే బాగుంటుందని తెలియజేశారు. అయితే 18 శాతం కంపెనీలు, ఉద్యోగులు సోమవారం లేదంటే బుధవారం సెలవు ఉంటే పని నుంచి కాస్త బ్రేక్‌ దొరికినట్లుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.