Yashwant Sinha : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 18 ప్రతిపక్షాల పార్టీల నాయకులు యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.

Yashwant Sinha : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 18 ప్రతిపక్షాల పార్టీల నాయకులు యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని యశ్వంత్ సిన్హా విజ్ఞప్తి చేశారు. యశ్వంత్ సిన్హా గతంలో కేంద్ర ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా పని చేశారు.
ప్రస్తుతం తృణమూల్ పార్టీలో కొనసాగుతున్న యశ్వంత్ సిన్హా.. ఇవాళ ఉదయం ఆ పార్టీకి రాజీనామా చేశారు. విపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇవాళ అధికార బీజేపీ పార్టీ కూడా తమ అభ్యర్థిని తేల్చనుంది. పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా హాజరుకానున్నారు. జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు టిఆర్ఎస్ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. బీజేపీయేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ ఒకే చెప్పారు. మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాకు గులాబీ పార్టీ మద్దతు ప్రకటించింది. సీఎం కేసీఆర్ తో ఫోన్ లో శరద్ పవార్ మాట్లాడారు.
కేసీఆర్…యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారని శరద్ పవార్ చెప్పారు. అయితే, టీఆర్ఎస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం యశ్వంత్ సిన్హా పాటిస్తున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం పాటించామన్న మెసేజ్ ప్రజలకు పంపే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.
TRS Support : రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం..ఆయనకే గులాబీ మద్దతు!
యశ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత 24 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా కొనసాగారు. 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేశారు. 1998, 1999, 2009లో హజారీబాగ్ ఎంపీగా ఎన్నికయ్యారు.
1998లో చంద్రశేఖర్ కేబినెట్లో ఏడాది పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 2002లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. 2021, మార్చి 13న తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మార్చి 15న టీఎంసీ వైస్ ప్రెసిడెంట్‌గా యశ్వంత్ సిన్హా ఎన్నుకున్నారు.
- Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
- TRS Support : రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం..ఆయనకే గులాబీ మద్దతు!
- Presidential election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..? టీఎంసీకి రాజీనామా
- Presidential Election 2022 : మరోసారి ప్రతిపక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం
- CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారు
1AP Cabinet Decisions : కోనసీమ జిల్లా పేరు మార్పు, 27న ఖాతాల్లోకి డబ్బులు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
2‘Alien Coin’ : వైరల్ అవుతున్న ‘ఏలియన్ నాణెం’..గ్రహాంతరవాసుల కరెన్సీయా?!
3Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
4Presidential Election 2022 : వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి-సోము వీర్రాజు
5Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాకే ఏపీ కేబినెట్ ఆమోదం
6Ranji Trophy: సెంచరీ బాది అచ్చం కేఎల్ రాహుల్లా చేసిన యశ్ దుబే.. వీడియో
7Dil Raju : ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో దిల్ రాజు సమావేశం.. వేతనాలు కొలిక్కి వచ్చినట్టేనా??
8Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు
9Prabhudeva : మాస్టర్.. ఓ మై మాస్టర్ అంటున్న మై డియర్ భూతం..
10Maharashtra politics : రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ వేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా..శివసేన నేత సంజయ్ బోస్లే అరెస్ట్..
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?
-
YCP Support : ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
-
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక నిర్ణయాలు!
-
Draupadi Murmu : నేడే ద్రౌపది ముర్ము నామినేషన్
-
iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
-
Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?