International Idli Day 2023 : ఇడ్లీ కోసం రూ. లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాదీ.. 8,428 ప్లేట్లు లాగించేసిన ఇడ్లీ ప్రియుడు

ఇడ్లీ కోసం రూ. లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాద్ వ్యక్తి ఏకంగా 8,428 ప్లేట్లు లాగించేసిన ఇడ్లీ ప్రియుడు గురించి స్విగ్గీ చెప్పిన విశేషాలు అన్నీ ఇన్నీ కావండోయ్..ఇడ్లీ అంత టేస్ట్ గా..ఉన్నాయ్ వేడి వేడిగా.. ఓ లుక్కేయండీ..

International Idli Day 2023 : ఇడ్లీ కోసం రూ. లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాదీ.. 8,428 ప్లేట్లు లాగించేసిన ఇడ్లీ ప్రియుడు

Hyderabad Man spends Rs 6 lakh on Idli in 1 year..

International Idli Day 2023 : రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించే బ్రేక్ ఫాస్ట్ ఏది అంటే ఠక్కున చెప్పేస్తాం ‘ఇడ్లీ’అని. ఆవిరితో ఉడికే చక్కటి బ్రేక్ ఫాస్ట్ ‘ఇడ్లీ’. చక్కగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఇడ్లీ రెండు రకాల చట్నీలు, సాంబార్ తో నంచుకుని తింటే నా సామిరంగా స్వర్గమే నోట్లో తాండవం ఆడుతున్నట్లుగా ఉంటుంది. అటువంటి ఇడ్లీ అందరికి ఇష్టమే..త్వరగా తయారైపోతుంది..పైగా చక్కటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంటే ఠక్కున ఇడ్లీనే ఆర్డర్ చేస్తారు. అటువంటి ఇడ్లీని ఇష్టపడని భారతీయులు బహుశా ఉండరేమో. మరీ ముఖ్యగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇడ్లీ ప్రియులు ఎక్కువనే చెప్పాలి. అటువంటి ఇడ్లీకి ఓ ప్రత్యేక మైన రోజు కూడా ఉందనే విషయం తెలిసిందే. ఇంతకీ పొద్దు పొద్దునే ఈ ఇడ్లీ గురించి చెబుతూ నోరు ఊరించేస్తున్నారేంటీ అసలు విషయం ఏంటీ అంటారా? ఉండనే ఉంది అసలు విషయం ఏంటీ అంటే..

ఓ వ్యక్తికి ఇడ్లీ అంటే ఎంతో ఇష్టం..అది అలాంటిలాంటి ఇష్టం కాదు..ఏడాదికి ఏఖంగా.. 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసి లాగించేసేంత ఇష్టం..! అంతర్జాతీయ ఇడ్లీ డే (International Idli Day) సందర్భంగా (March 30)ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ సంస్థ స్విగ్గీ (Swiggy) ఈ విషయాన్ని తెలిపింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఒక్క ఏడాదిలో 6 లక్షల విలువైన..8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసాడని తెలిపింది స్విగ్గీ..బహుశా అతనికి అతని కుటుంబానికి ఇడ్లీ అంటే అంత ఇష్టమేమో..ఇలా ఆర్డర్ చేయటం వేడి వేడిగా ఇడ్లీ ఆరగించే పనిలో ఉన్నట్లున్నారు ఈ హైదరాబాదీ..ఆయన కుటుంబము..

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తనకు..తన కుటుంబానికి, బహుశా ఆయన స్నేహితులకు కలిపి ఏడాదికి 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారని స్విగ్గీ అంతర్జాతీయ ఇడ్లీ డే సందర్భంగా వెల్లడించింది. బెంగళూరు, చెన్నైకి వెళ్లిన సమయాల్లో సదరు హైదరాబాదీ ఈ ఆర్డర్లు చేసినట్లుగా వెల్లడించింది.

అదే సమయంలో గత 12 నెలల్లో మొత్తం 33 మిలియన్ల ఇడ్లీలను డెలివరీ చేశామని వెల్లడించింది. 2022 మార్చి 30 నుంచి 2023 మార్చి వరకు 25 వరకు వచ్చిన ఆర్డర్ల ఆధారంగా స్విగ్గీ ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. అలా ఆర్డర్లు ఎక్కువగా చేసిన నగరాల్లో బెంగళూరు,హైదరాబాద్, చెన్నైలు ఉన్నాయని వెల్లడించింది. ఆ తరువాత స్థానాల్లు కోయంబత్తూర్, ముంబై, పూనె, విశాఖపట్నం, ఢిల్లీ, కోల్ కతా, కొచ్చి వంటి నరగాలల్లో అయితే బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే కాకుండా లంచ్ సమయంలో కూడా ఇడ్లీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.

అలాగే ఇడ్లీల్లో ఎన్నో రకాలున్నాయి. రకరకాల ప్లేవర్లలో ఇడ్లీలో హాట్ కేకుల్లా సేల్ అయిపోతుంటాయి. ఇడ్లీలు ఎన్ని రకాలు ఉన్నా వాటికుండే డిమాండే వేరప్పా అన్నట్లుగా ఉంటుంది. పైగా అది ఏ సమయంలో అయినాసరే..అలా ఒక్కో ప్రాంతంలో ప్రజలు ఒక్కో రకం ఇడ్లీ రుచిని ఇష్టపడుతుంటారని కూడా స్విగ్గీ వెల్లడించింది. అలా చూసుకుంటే బెంగళూరులో రవ్వ ఇడ్లీకి మంచి పాపులర్ ఉందని అలాగే మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రజలు కాస్త ఘాటు ఘాటుని ఇష్టపడతారు కాబట్టి ఇడ్లీతో పాటు నెయ్యి, కారప్పొడి వంటి కాంబినేషన్ల ఆర్డర్లు వస్తుంటాయని అలాగే తమిళ తంబీలు కూడా నెయ్యి, కారప్పొడి వంటి కాంబినేషన్ల ఆర్డర్లు ఇస్తుంటారని తెలిపింది స్విగ్గీ.