24-Carat Traitor: 24 క్యారెట్ల దొంగ.. సింథియా తిరిగి వస్తున్నాడన్న వార్తలపై కాంగ్రెస్ ఆక్రోశం

నా స్నేహితుడు లాంటి వాడైన కపిల్ సిబాల్ లాంటి వ్యక్తి గురించి ఆలోచిస్తే సబబుగా ఉంటుంది. ఆయన సింథియా, హిమంత బిశ్వా శర్మలా కాకుండా పార్టీపై చాలా గౌరవాన్ని ఉంచారు. పార్టీ బయట ఉన్నప్పటికీ హుందాగా ఉన్నారు. అటువంటి నాయకులను తిరిగి స్వాగతించవచ్చు. కానీ పార్టీని వీడి పార్టీ నాయకత్వాన్ని, విధానాల్ని బలహీన పర్చాలని చూసిన సింథియా, హిమంత బిశ్వా శర్మ లాంటి వారిని స్వాగతించకూడదు

24-Carat Traitor: 24 క్యారెట్ల దొంగ.. సింథియా తిరిగి వస్తున్నాడన్న వార్తలపై కాంగ్రెస్ ఆక్రోశం

24-Carat Traitor says Congress On Jyotiraditya Scindia for Comeback Chances

24-Carat Traitor: కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింథియా తిరిగి హస్తం పార్టీలోకి రానున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. సింథియాను ‘24 క్యారెట్ల దొంగ’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. పార్టీ నుంచి వెళ్లిపోయి స్వలాభాలకు, విమర్శలకు పోకుండా ఉన్న కపిల్ సిబాల్ లాంటి వారికి తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించి కాంగ్రెస్.. సింథియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ లాంటి వారిని ఎప్పటికీ అనుమతించబోమని తేల్చి చెప్పింది.

Supreme Court: జడ్జీల నియామకంలో కొలీజియంను సమర్ధించిన సుప్రీం.. కేంద్ర ప్రభుత్వానికి సూటి సమాధానం

భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా ప్రాంతంలో కొనసాగుతోంది. రాహుల్ యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఉన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘పార్టీని వీడి తిట్టిన వారిని, విమర్శలు చేసని వారిని, తమ స్వలాభాలు చూసుకున్న వారిని ఎప్పటికీ తిరిగి ఆహ్వానించ కూడదని నేను అంటున్నాను. పార్టీని వీడినప్పటికీ గౌరవంగా, మౌనంగా ఉన్నవారి కోసం తలుపులు ఎప్పటికైనా తెరిచే ఉంటాయి. కానీ, పార్టీ పతనాన్ని కోరుకునే వారు ఎప్పటికైనా ద్రోహులే. వారిని తిరిగి అనుమతించకూడదు’’ అని అన్నారు.

Vasantha Mulasavalagi: ముస్లింలకు నిజంగా ధ్వేషమే ఉంటే ఒక్క హిందువు మిగిలేవారు కాదట!.. వివాదాస్పదమవుతున్న రిటైర్డ్ జడ్జి వ్యాఖ్యలు

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నా స్నేహితుడు లాంటి వాడైన కపిల్ సిబాల్ లాంటి వ్యక్తి గురించి ఆలోచిస్తే సబబుగా ఉంటుంది. ఆయన సింథియా, హిమంత బిశ్వా శర్మలా కాకుండా పార్టీపై చాలా గౌరవాన్ని ఉంచారు. పార్టీ బయట ఉన్నప్పటికీ హుందాగా ఉన్నారు. అటువంటి నాయకులను తిరిగి స్వాగతించవచ్చు. కానీ పార్టీని వీడి పార్టీ నాయకత్వాన్ని, విధానాల్ని బలహీన పర్చాలని చూసిన సింథియా, హిమంత బిశ్వా శర్మ లాంటి వారిని స్వాగతించకూడదు’’ అని అన్నారు.

Soumya Chaurasia: ఛత్తీస్‌గఢ్ సీఎం డిప్యూటీ సెక్రెటరీని అరెస్ట్ చేసిన ఈడీ

అయితే సింథియాకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి రానందునే పార్టీ వీడారనే విమర్శ ఉంది. ఇదే విషయాన్ని జైరాం రమేశ్ వద్ద ప్రస్తావించగా.. ‘‘సింథియా ఒక ద్రోహి. చాలా పెద్ద ద్రోహి. ఎంత పెద్ద ద్రోహంటే.. 24 క్యారెట్ల ద్రోహి’’ అని అన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల అనంతరం, సింథియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక హిమంత బిశ్వా శర్మ 2015లోనే హస్తానికి గుడ్ బై చెప్పి కమల తీర్థం పుచ్చుకున్నారు. సింథియా కేంద్ర మంత్రి కాగా, శర్మ అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు.