Mamata meets Patnaik: ఒడిశా ముఖ్యమంత్రిని కలిసిన మమతా బెనర్జీ.. ఫ్రంట్‭లో పట్నాయక్ చేరతారా?

ఇందులో కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కాకుండా దేశంలోని విపక్షాలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఇక మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేశారు. కేజ్రీవాల్ సైతం ఆ రెండు పార్టీల వైపుకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఒక్క నితీశ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్నారు

Mamata meets Patnaik: ఒడిశా ముఖ్యమంత్రిని కలిసిన మమతా బెనర్జీ.. ఫ్రంట్‭లో పట్నాయక్ చేరతారా?

Bengal CM Mamata Meets Odisha CM Patnaik Amid New Front Buzz

Mamata meets Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‭(Odisha  Chief Minister Mamata Banerjee)ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) గురువారం కలిశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఒడిశా వచ్చిన ఆమె.. రాబోయే ఎన్నికల దృష్ట్యా పట్నాయక్‭తో ప్రత్యేకంగా చర్చలు చేయనున్నట్లు సమాచారం. కాగా, సమాజ్‭వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‭(SP Chief Akhilesh Yadav)తో మూడు రోజుల క్రితమే పొత్తు ఏర్పాటు చేసుకున్నారు మమత. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీకి చోటు ఇవ్వలేదు. కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు.

AAP vs BJP: పోడియం వార్ ముగిసింది, పోస్టర్ వార్‭ మొదలైంది.. ఢిల్లీలో ఢీ అంటే ఢీ అంటున్న ఆప్, బీజేపీ

అయితే.. మమత, అఖిలేష్ ఏర్పాటు చేసిన ఈ ఫ్రంటులో పట్నాయక్ చేరతారా, లేదా అనేది చర్చనీయాంశమైంది. ఒడిశాకు వచ్చిన మమతా ఉద్దేశాలు ఆయనకు స్పష్టంగానే తెలిసినప్పటికీ, ఏ పార్టీకి దూరంగానూ ఏ పార్టీకి దగ్గరగానూ ఉండని నవీన్ పట్నాయక్.. మమతా కూటమిలో చేరతారని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) నేతృత్వంలో ఒక కూటమి ఏర్పాట్లు జరుగుతుండగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) సైతం కూటమి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు.

Shiv Sena: సంజయ్ రౌత్‭ను తొలగించిన శివసేన.. ఆ స్థానంలో గజానన్‭కు అవకాశం

ఇందులో కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కాకుండా దేశంలోని విపక్షాలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఇక మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేశారు. కేజ్రీవాల్ సైతం ఆ రెండు పార్టీల వైపుకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఒక్క నితీశ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్నారు. కానీ, ఆయన కూడా పూర్తి స్థాయిలో అందుకు అనుకూలంగా లేనట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయనేది ఆసక్తిని రేపుతోంది. రెండు దశాబ్దాలకు పైగా ఒడిశాను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఆయన.. దేశంలోని బలమైన నేతల్లో ఒకరు. ఆయనను ఫ్రంటులోకి తీసుకుంటే పదికి పైగా పార్లమెంటు స్థానాలు చేతిలో ఉన్నట్లే. అందుకే ఫ్రంట్ నేతలు ఒడిశా వైపు చూస్తున్నారు.