AAP vs BJP: పోడియం వార్ ముగిసింది, పోస్టర్ వార్‭ మొదలైంది.. ఢిల్లీలో ఢీ అంటే ఢీ అంటున్న ఆప్, బీజేపీ

మోదీకి వ్యతిరేకంగా వేసిన పోస్టర్ల గురించి ఆప్ పెదవి విప్పలేదు కానీ, కేజ్రీవాల్‭కు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లు మాత్రం బీజేపీ నేత మంజిందర్ సింగ్ పేరిట వెలిశాయి. ఇక మోదీ హఠావో అంటూ వేసిన పోస్టర్లపై అనుమానిత వ్యక్తులపై 130 కేసులు నమోదు అయ్యాయి. కాగా, ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశారు

AAP vs BJP: పోడియం వార్ ముగిసింది, పోస్టర్ వార్‭ మొదలైంది.. ఢిల్లీలో ఢీ అంటే ఢీ అంటున్న ఆప్, బీజేపీ

Delhi Poster War: After AAP's 'Anti-Modi' Posters, BJP Puts Up 'Kejriwal Hatao' Posters

AAP vs BJP: దేశ రాజధాని ఢిల్లీలో రెండు అధికార పార్టీల మధ్య తగాదా కొనసాగుతూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య.. తరుచూ ఏదో ఒక గొడవ తలెత్తుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇరు పార్టీల మధ్య ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వివాదం సుదీర్ఘకాలం సాగింది. మున్సిపల్ కార్యాలయంలో ఇరు పార్టీల నేతలు అనేకమార్లు బాహాబాహీకి దిగారు. పొడియం బద్దలయ్యేంతలా హంగామా చేశారు. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ ఘర్షణ.. ఎట్టకేలకు చల్లబడింది.

Rent a Girlfriend: అచ్చట అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్‭ లభించును.. పార్ట్నర్‭గా పార్ట్ టైం డ్యూటీ

అంతే, దీని వెనుకే మరో వివాదం తెరపైకి వచ్చింది. అదే పోస్టర్ వివాదం. ‘మోదీ హఠావో, దేశ్ బచావో’ అని హిందీలో రాసి ఉన్న పోస్టర్లు రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే ఢిల్లీ వ్యాప్తంగా కనిపించాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీయే ఈ పోస్టర్లు వేసినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినప్పటికీ, ఆ పార్టీయే వేయించదనే వాస్తవం అందరికీ తెలిసిందే. కాగా, తాజాగా బీజేపీ దీనికి కౌంటర్ అటాక్ ప్రారంభించింది. ‘అరవింద్ కేజ్రీవాల్ కో హఠావో.. ఢిల్లీ బచావో’ అనే నినాదాలతో ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు అంటించింది.

Vijay Mallya: అంత డబ్బున్నా కూడా పారిపోయాడట.. విజయ్ మాల్యా గురించి విస్తుపోయే నిజాలు చెప్పిన సీబీఐ

అయితే మోదీకి వ్యతిరేకంగా వేసిన పోస్టర్ల గురించి ఆప్ పెదవి విప్పలేదు కానీ, కేజ్రీవాల్‭కు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లు మాత్రం బీజేపీ నేత మంజిందర్ సింగ్ పేరిట వెలిశాయి. ఇక మోదీ హఠావో అంటూ వేసిన పోస్టర్లపై అనుమానిత వ్యక్తులపై 130 కేసులు నమోదు అయ్యాయి. కాగా, ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశారు. అయితే తనపై వెలిసిన పోస్టర్లపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తనను తొలగించాలని వేసిన పోస్టర్ల మీద తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వ్యతిరేక పోస్టర్లు అంటించే హక్కు ఉంటుందని అన్నారు. ఇక ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన వ్యవహారంలో ఆరుగురిని ఎందుకు అరెస్ట్ చేశారో తనకు అర్థం కావడం లేదంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.