ఏం జరుగుతోంది : ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు మంతనాలు

వల్లభనేని వంశీ ఇష్యూ మర్చిపోక ముందే టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతారా. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 06:18 AM IST
ఏం జరుగుతోంది : ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు మంతనాలు

వల్లభనేని వంశీ ఇష్యూ మర్చిపోక ముందే టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతారా. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు

వల్లభనేని వంశీ ఇష్యూ మర్చిపోక ముందే టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతారా. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడే యోచనలో ఉన్నారా.. అంటే… అవుననే సమాధానం వస్తోంది. ప్రకాశం జిల్లా టీడీపీలో కలకలం రేగింది. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవితో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఈ చర్చకు దారితీసింది.

ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారని వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కరణం బలరామ్, వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ లతో బాబు మంతనాలు జరిపారట. జిల్లాలో, నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు ఆరా తీశారట. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. గొట్టిపాటి రవితో అమరావతిలో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవడం చర్చకు దారితీసింది. 

గొట్టిపాటి రవితో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చలు జరపాడనే వార్తలు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రవి ఏమైనా పార్టీకి దూరం అవుతారా అనే అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రానైట్ బిజినెస్ విషయంలో టీడీపీ ప్రభుత్వం రవిని ఇబ్బందులకు గురి చేసిందని… ఇప్పుడు అవే సమస్యలు మళ్లీ రావొచ్చని రవి వర్గం సందేహపడుతోందట. అందుకే పార్టీ మారే యోచనలో ఆయన ఉన్నారని చెప్పుకుంటున్నారు.

ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో బాబు అలర్ట్ అయ్యారు. మరికొందరు దూరం అవకుండా చర్యలు చేపట్టారు. గొట్టిపాటి రవి పార్టీని వీడతారని ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు గొట్టిపాటి రవితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారని, ఆయనతో చర్చలు జరిపారని సమాచారం. ఇక కరణం బలరామ్ సైతం బీజేపీ నేత సుజనా చౌదరితో సమావేశం కావడం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నింపింది.