BJP vs Nitish: నితీశ్‭కు మరోసారి షాకిచ్చిన బీజేపీ.. అరుణాచల్, మణిపూర్‭లలో జరిగిందే మళ్లీ రిపీట్

బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అందుకే తామంతా రాజీనామా చేసి బీజేపీ గూటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. బిహార్ రాష్ట్రంలో బీజేపీతో జేడీయూ పొత్తు తెంచుకుని ఆర్జేడీతో కలిసిన అనంతరం మొదటగా అరుణాచల్ ప్రదేశ్‭లోని జేడీయూకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, అందరికందరూ బీజేపీలో చేరారు. అనంతరం మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో చేరారు.

BJP vs Nitish: నితీశ్‭కు మరోసారి షాకిచ్చిన బీజేపీ.. అరుణాచల్, మణిపూర్‭లలో జరిగిందే మళ్లీ రిపీట్

BJP gave third stroke to Nitish kumar

BJP vs Nitish: నితీశ్ కుమార్‭కు భారతీయ జనతా పార్టీ వరుస షాక్‭లు ఇస్తోంది. ఎన్డీయే నుంచి నితీశ్ బయటికి వెళ్లిన అనంతరమే అరుణాచల్, మణిపూర్‭లలోని జేడీయూ ఎమ్మెల్యేలు వరుస బెట్టి కమలం గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఇలాంటి వాతావరణమేమీ కనిపించలేదు. అయితే తాజాగా మళ్లీ ఈ చేరికల్లో బీజేపీ జోరు పెంచింది. తాజాగా డయ్యూ డామన్ ప్రాంతంలో జేడీయూకి ఉన్న 17 మంది పంచాయతీ సభ్యుల్లో 15 మంది కాషాయ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన అనంతరం జేడీయూ నేతలు మాట్లాడుతూ బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అందుకే తామంతా రాజీనామా చేసి బీజేపీ గూటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. బిహార్ రాష్ట్రంలో బీజేపీతో జేడీయూ పొత్తు తెంచుకుని ఆర్జేడీతో కలిసిన అనంతరం మొదటగా అరుణాచల్ ప్రదేశ్‭లోని జేడీయూకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, అందరికందరూ బీజేపీలో చేరారు. అనంతరం మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో చేరారు. ఇక తాజాగా డయ్యూ డామన్ వంతు వచ్చింది.

బిహార్‭లో జేడీయూ-ఆర్జేడీ కలిసిపోయినప్పటి నుంచే నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు గుసగుసలు వినిపించాయి. కొద్ది రోజుల్లో తేజశ్వీని ముఖ్యమంత్రి చేసి, ఆయన ప్రధాని మంత్రి పదవికి పోటీ పడతారని చెప్పుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ గుసగుసలకు తెర దించుతూ తేజశ్వీ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ సముఖంగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించే పరిస్థితిలో లేదు. ఇక జాతీయ హోదా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా మాయావతి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ అంతగా ప్రభావం చూపడం లేదు. పైగా విపక్షాలు ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. ఇక ఇతర ప్రాంతీయ పార్టీలేవీ తమ రాష్ట్రాలు దాటి ప్రభావం చూపలేవు. బయటికి రావడానికి కూడా అంత సముఖంగా లేవు. దీంతో నితీశ్ అభ్యర్థిత్వం ఖరారు చేసుకునేందుకు బిహార్ పార్టీలు పావులు కదుపుతున్నాయి.

HD Kumaraswamy: మా డబ్డులతో హిందీ భాషా దినోత్సవం చేయాల్సిన అవసరం లేదు