మోడీకి మరో లేఖ : పోలవరానికి నిధులడిగిన బాబు

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి మరో లేఖాస్త్రం సంధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ రాశారు. నిర్మాణ నిధుల గురించి ప్రస్తావించారు. ఎలాంటి అవినీతి లేకుండా శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్నామని, వెంటనే నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. ఫండ్స్ విషయంలో కేంద్రం చేసే జాప్యం వల్ల నిర్మాణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చంద్రబాబు లేఖలో తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 09:52 AM IST
మోడీకి మరో లేఖ : పోలవరానికి నిధులడిగిన బాబు

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి మరో లేఖాస్త్రం సంధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ రాశారు. నిర్మాణ నిధుల గురించి ప్రస్తావించారు. ఎలాంటి అవినీతి లేకుండా శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్నామని, వెంటనే నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. ఫండ్స్ విషయంలో కేంద్రం చేసే జాప్యం వల్ల నిర్మాణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చంద్రబాబు లేఖలో తెలిపారు.

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి మరో లేఖాస్త్రం సంధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ రాశారు. నిర్మాణ నిధుల గురించి ప్రస్తావించారు. ఎలాంటి అవినీతి లేకుండా శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్నామని, వెంటనే నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. ఫండ్స్ విషయంలో కేంద్రం చేసే జాప్యం వల్ల నిర్మాణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చంద్రబాబు లేఖలో తెలిపారు. పోలవరానికి ఇవ్వాల్సిన 3వేల 722 కోట్ల పెండింగ్ నిధులను తక్షణం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇప్పటివరకూ 10వేల 459 కోట్లు ఖర్చు చేయగా కేవలం 6వేల 727 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. 2018 జూలైలో పోలవరంలో పర్యటించినప్పుడు ఫిబ్రవరిలోపు నిధులు మొత్తం విడుదల చేస్తామని హామీ ఇచ్చారని.. మీ మాట మీద ఎంతవరకు నిలబడ్డారో చెప్పాలని నితిన్ గడ్కరీని చంద్రబాబు నిలదీశారు. 5 రాష్ట్రాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ లేఖ రాసి పంపారు. ఎన్నికల శంఖారావం పూరించడంలో భాగంగా పార్టీ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. కోల్‌కతాలో బీజేపీ వ్యతిరేక పక్షాలు నిర్వహించిన సభపైనా చంద్రబాబు చర్చించారు. అంతకంతే పెద్ద ఎత్తున నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బీజేపీ వ్యతిరేక పక్షాలతో మెగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలు:
* భవిష్యత్తులో ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టాలి
* రైతులను ఆకట్టుకునేందుకు ఎలాంటి పథకం తీసుకురావాలి
* పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్, జయహో బీసీ సదస్సుపై చర్చ
* కోల్‌కతాలో యాంటీ బీజేపీ పక్షాల మీటింగ్‌పై చర్చ
* అమరావతిలో భారీ స్థాయిలో యాంటీ బీజేపీ పార్టీలతో భారీ ర్యాలీ, బహిరంగ సభ

పోలవరంపై కేంద్రం వివక్ష చూపుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసి పంపారని ఆయన తెలిపారు. సొంత నిధులతో పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టినప్పటకీ కేంద్రం సహాయనిరాకరణ చేస్తోందని, కేంద్రం వైఖరిపై సీఎం మరోసారి లేఖ పంపారని కళా వెంకటరావు చెప్పారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు.