బియ్యం గురించి తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి : సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు (మంగళవారం..డిసెంబర్ 10,2019) వాడీవేడిగా స్టార్ట్ అయ్యాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సన్నబియ్యం

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 05:02 AM IST
బియ్యం గురించి తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి : సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు (మంగళవారం..డిసెంబర్ 10,2019) వాడీవేడిగా స్టార్ట్ అయ్యాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సన్నబియ్యం

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు (మంగళవారం..డిసెంబర్ 10,2019) వాడీవేడిగా స్టార్ట్ అయ్యాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సన్నబియ్యం సరఫరాపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సన్నబియ్యం ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందన్నారు. సన్నబియ్యం ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని మంత్రి కొడాలి నాని అనడం విడ్డూరంగా ఉందని అచ్చెన్న అన్నారు. ఇచ్చిన మాట ఎందుకు తప్పారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 1 నుంచి సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వ పెద్దలే చెప్పారు. ఇచ్చిన మాట ఎందుకు తప్పారో చెప్పాలి. తర్వాత సన్నబియ్యం బదులు నాణ్యమైన బియ్యం అని పేరు మార్చారు. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద పథకాన్ని అమలుచేశారు. శ్రీకాకుళం జల్లా కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి బియ్యం సరఫరా చేశారు. బియ్యం ధర కంటే రవాణ ఖర్చు ఎక్కువైంది. ప్లాస్టిక్ సంచుల్లో తీసుకురావడంతో బియ్యం పాడైపోయాయి. బియ్యం బాగోలేవని వాట్సాప్ లో ఫొటోలు పెడితే ప్రజలపై కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్చ లేకుండాపోయింది. సన్నబియ్యం ఇవ్వడం లేదని మంత్రి కొడాలి నాని చెప్పారు. జగన్ మాత్రం రాష్ట్రమంతా తిరిగి సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మాట ఎందుకు తప్పారు” అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సన్నిబియ్యం సరఫరాపై టీడీపీ చేసిన ఆరోపణలకు సీఎం జగన్ స్పందించారు. ఘాటుగా బదులిచ్చారు. బియ్యం గురించి తెలుసుకుని నాలెడ్జ్ పెంచుకోవాలని సీఎం జగన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సూచించారు. అసలు సన్న బియ్యం అనే పేరే లేదు… స్వర్ణనే సన్నబియ్యం అంటారు… తెలియకపోతే తెలుసుకోండి… మేము ఏం చెబుతున్నామో వింటే నాలెడ్జ్ పెరుగుతుంది” అని చురకలు అంటించారు సీఎం జగన్. తమ మేనిఫెస్టోలో సన్న బియ్యం అనే మాటే లేదని సీఎం జగన్ అన్నారు. ఫలానా తరహా బియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలేదన్నారు.

కళ్లద్దాలు సరి చేసుకుని మేనిఫెస్టోను చదవాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పారు. టీడీపీ హయాంలో ఇచ్చిన బియ్యం కంటే మేలైన బియ్యం శ్రీకాకుళంలో ఇస్తున్నామని సభలో వివరించారు. 2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన(స్వర్ణ) బియ్యం ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ వాళ్లను పిచ్చాసుపత్రికి పంపిస్తే కానీ నయం కాదని సీఎం జగన్ మండిపడ్డారు.