Dalith Bandhu : పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్, తెలంగాణలో మరో కొత్త పథకం

తెలంగాణలో మరో కొత్త పథకం త్వరలో అమల్లోకి రానుంది. అదే దళిత(ఎస్సీ) సాధికారత పథకం. ఈ స్కీమ్ కి ‘తెలంగాణ దళిత బంధు’ అనే పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు.

Dalith Bandhu : పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్, తెలంగాణలో మరో కొత్త పథకం

Dalith Bandhu

Dalith Bandhu : తెలంగాణలో మరో కొత్త పథకం త్వరలో అమల్లోకి రానుంది. అదే దళిత(ఎస్సీ) సాధికారత పథకం. ఈ స్కీమ్ కి ‘తెలంగాణ దళిత బంధు’ అనే పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. రాష్ట్రంలో దళితుల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఓ నియోజకవర్గంలో ఈ పథకం అమలు చేయనున్నారు. అది కూడా కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు.

తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతుబీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని సైతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని సీఎం సెంటిమెంటుగా కొనసాగిస్తూ…‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.