చిక్కుల్లో బాలయ్య: నోటీసులు జారీ చేసిన హైకోర్టు

నందమూరి హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై హైకోర్టు బాలయ్యకు నోటీసులు జారీ చేసింది.

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 01:49 AM IST
చిక్కుల్లో బాలయ్య: నోటీసులు జారీ చేసిన హైకోర్టు

నందమూరి హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై హైకోర్టు బాలయ్యకు నోటీసులు జారీ చేసింది.

నందమూరి హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై హైకోర్టు బాలయ్యకు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లా  నంద్యాల ఉపఎన్నికలో ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని  హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఈ  ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన బాలకృష్ణపై ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనల కింద కేసు నమోదు చేసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ  కె.శివకుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తూ బాలకృష్ణ ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారని, ఆయనపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసేలా  ఆదేశించాలని కోరుతూ శివకుమార్‌ ఆగస్టు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం(ఫిబ్రవరి-22-2019) జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల  కోడ్‌ను ఉల్లంఘించిన బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఈ క్రమంలో వ్యాజ్యంలో బాలకృష్ణ వాదనలు తెలుసుకోవడం తప్పనిసరని భావించిన  ధర్మాసనం  నోటీసులు జారీచేసింది. బాలకృష్ణకు నోటీసులు అందచేసే వెసులుబాటును పిటిషనర్‌కు కల్పించింది.