Karnataka Politics: కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కూలిపోతుందట.. 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి?

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి బీకే హరిప్రసాద్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి

Karnataka Politics: కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కూలిపోతుందట.. 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి?

Siddaramaiah Govt: ప్రస్తుతం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా సవ్యంగా సాగడం లేదు. హైదరాబాద్‌లో రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగినప్పుడు సీనియర్ నేత బీకే హరిప్రసాద్‌ను వేదికపై మాట్లాడనివ్వలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. బీకే హరిప్రసాద్ సీనియారిటీకి కాంగ్రెస్ పెద్దపీట వేయడం లేదని, దీంతో ఆయన తీవ్రంగా బాధపడ్డారని బీజేపీ నేత బసనగౌడ ఆర్ పాటిల్ అన్నారు. ఇది వారి అంతర్గత విషయమే అయినప్పటికీ, సిద్ధరామయ్య గురించి హరిప్రసాద్ చాలా చెప్పారని పాటిల్ అన్నారు. ఇక ఇది మాట్లాడుతూనే జనవరి తర్వాత సిద్ధరామయ్య ప్రభుత్వం ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jharkhand: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‭కు సుప్రీంలో ఎదురుదెబ్బ.. ఈడీ పిటిషన్ పై నో రిలీఫ్

ప్రభుత్వం ఉండదని చెప్పడానికి ఆయన స్పష్టమైన కారణాన్ని కూడా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు వారితో టచ్‌లో ఉన్నారని పాటిల్ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతను ఎందుకు నియమించాలంటూ ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇలాగే జరిగింది. కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ప్రభుత్వంలోని 22 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపుకు తిప్పుకుంది. దీంతో అప్పటి కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. అనంతం యడియూరప్ప ప్రభుత్వం ఏర్పడింది.

AIADMK vs BJP: బీజేపీతో పొత్తు ఉండదని బాంబ్ పేల్చిన అన్నాడీఎంకే.. ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాక్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి బీకే హరిప్రసాద్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వేదికపై మాట్లాడేందుకు సిద్ధరామయ్య, శివకుమార్‌లకు అవకాశం కల్పించారు. కానీ బీకే హరిప్రసాద్‌ను మాట్లాడనివ్వలేదు. అంతే కాదు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హరిప్రసాద్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో హరిప్రసాద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని అవసరమైతే, హస్తం పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.