Rajastan: సీఎం కూర్చీపై రాజకీయ హైడ్రామా.. పైలట్‭కు దక్కకుండా చేసేందుకే ఇదంతా

గెహ్లోత్ వర్గంలోని ఒక ఎమ్మెల్యే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చని చెబుతూనే.. ముఖ్యమంత్రిని సోనియా, రాహుల్, గెహ్లోత్ కలిసి నిర్ణయిస్తారని అన్నారు. అంతే కాకుండా ఇక్కడ మరో మెలిక పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన అనంతరం సీఎం పదవికి గెహ్లోత్ రాజీనామా చేస్తారట. అంటే ఒకవేళ ఆయన ఓడిపోతే సీఎం పదవి అలాగే ఉంటుందన్నమాట.

Rajastan: సీఎం కూర్చీపై రాజకీయ హైడ్రామా.. పైలట్‭కు దక్కకుండా చేసేందుకే ఇదంతా

Political high drama Rajastan CM chair, Gehlot all efforts is to prevent Pilot

Rajastan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు అన్నీ సిద్ధమవుతున్నాయి. గాంధీ కుటుంబం అండదండలు ఉన్న అశోక్ గెహ్లోతే పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వాల్సింది. కానీ, శశి థరూర్ నామినేషన్ వేయడంతో ఎన్నిక తప్పలేదు. కాగా, ఉదయ్‭పూర్‭లో పార్టీ ప్రమాణం చేసినట్లు ఒకరికి ఒకే పదవి నియమం ఆధారంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవికి తొందరలోనే గెహ్లోత్ రాజీనామా చేయబోతున్నారు. అయితే గెహ్లోత్ స్థానాన్ని భర్తీ చేసే వారి విషయమై కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల కంటే ఈ విషయం పైనే పార్టీ తలకిందులవుతోంది.

తన ప్రత్యర్థి అయినా సచిన్ పైలట్‭కు ఎట్టి పరిస్థితుల్లో ఆ కుర్చీ దక్కకుండా చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు గెహ్లోత్. రాష్ట్రంలో తనకు మద్దతుగా ఉండే ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరిని సీఎంగా నిలబెట్టే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. వారి నుంచే పైలట్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గెహ్లోత్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగి.. తమ వర్గంలోని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

తాజాగా, గెహ్లోత్ వర్గంలోని ఒక ఎమ్మెల్యే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చని చెబుతూనే.. ముఖ్యమంత్రిని సోనియా, రాహుల్, గెహ్లోత్ కలిసి నిర్ణయిస్తారని అన్నారు. అంతే కాకుండా ఇక్కడ మరో మెలిక పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన అనంతరం సీఎం పదవికి గెహ్లోత్ రాజీనామా చేస్తారట. అంటే ఒకవేళ ఆయన ఓడిపోతే సీఎం పదవి అలాగే ఉంటుందన్నమాట.

JP Nadda: 93 ‘మన్ కీ బాత్’ కార్యక్రమాల్లో ప్రధాని ఒక్క సారి కూడా దాని గురించి మాట్లాడలేదు

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సొంత రాష్ట్రంలోనే సచిన్‭కు వ్యతిరేకంగా గ్రౌండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే గెహ్లోత్ తర్వాత రాష్ట్రంలో పైలటే జనాధరణ ఉన్న నేత. కొన్ని సందర్భాల్లో గెహ్లోత్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నట్లు కనిపిస్తూనే ఉంటుంది.

మరి పైలట్‭ను కాదని గెహ్లోత్ అభిలాషకు అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనే విషయం అంతు చిక్కడం లేదు. పైగా రాహుల్ గాంధీకి పైలట్ మంచి మిత్రుడు. ఇటు వైపేమో గాంధీ కుటుంబానికి గెహ్లోత్ నమ్మిన బంటు. దీంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ పార్టీ తలకిందులవుతుంది అనకుంటే దాన్ని మించి రాజస్తాన్ సీఎం పదవిపై హైడ్రామా కొనసాగుతోంది. ఏమైతేనేం.. ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే అధ్యక్ష ఎన్నిక ఫలితాలు వచ్చే వరకు ఆగాలి కావొచ్చు.

Odisha: తక్కువ కులం డాక్టర్ పోస్ట్‭మార్టం చేశాడని ఏకంగా శవాన్నే వెలేసిన బంధువులు