రాజధాని రగడ : ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చిన రాయలసీమ నేతలు

రాజయలసీమ నేతలు ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నారు. లేకపోతే గ్రేటర్‌ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 02:12 AM IST
రాజధాని రగడ : ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చిన రాయలసీమ నేతలు

రాజయలసీమ నేతలు ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నారు. లేకపోతే గ్రేటర్‌ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాజయలసీమ నేతలు ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నారు. లేకపోతే గ్రేటర్‌ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం వల్ల.. రాయలసీమ ప్రజలు అంత దూరం వెళ్లడం కష్టమవుతుందనే వాదాన్ని వినిపిస్తున్నారు.

రాజధాని మార్పుపై అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న రైతులకు.. రాయలసీమ నుంచి కాస్తంత మద్దతు లభిస్తున్నట్లు కనిపిస్తోంది. హైకోర్టును అమరావతి నుంచి తీసుకొచ్చి కర్నూలులో పెడతామనేంత వరకు ఓకే కానీ.. పరిపాలన రాజధానిని విశాఖకు తీసుకెళ్తామనడమే ఏం బాగోలేదంటున్నారు. కర్నూలులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్ పెట్టడాన్ని తప్పుపట్టారు.  

అమరావతిని రాజధానిగా ఉంచకపోతే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. అమరావతిని చంద్రబాబు రాజధానిని చేశారనే కారణంతోనే జగన్ క్యాపిటల్‌ను మార్చాలని అనుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిలో రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. 

అటు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా ఇదే అభిప్రాయం వినిపించారు. అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉంటుందనే చంద్రబాబు అమరావతిని క్యాపిటల్ చేశారని గుర్తు చేశారు. వికేంద్రీకరణ అభివృద్ధిలో జరగాలి గానీ.. రాజకీయంగా కాదని విమర్శించారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని, లేకపోతే కర్నూలుకు రాజధానిని మార్చాలని డిమాండ్ చేశారు.

రాజధానిని ముక్కలు చేసుకుంటూ పోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందన్నారు జేసీ దివాకర్‌రెడ్డి. కావాలంటే కడప, లేదా పులివెందులలో రాజధాని పెట్టుకోవాలని సూచించారు. విశాఖ వెళ్లాలంటే రాయలసీమ వాసులకు ఇబ్బందన్నారు జేసీ. రాజధానిని మార్చడం అంత సులభం కాదని చెప్పారు. 

కర్నూలులో హైకోర్టు వరకైతే స్వాగతిస్తామని.. అలాగని రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకోబోమని శైలజానాధ్‌ తెలిపారు. రాజధానిని మార్చాల్సి వస్తే రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి రాయలసీమ నుంచి కొత్త డిమాండ్‌ వినిపిస్తోంది. రాజధానిగా అమరావతిని కొనసాగించకపోతే.. గ్రేటర్‌ రాయలసీమ కోసం ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.