Sachin Pilot: రాజస్తాన్ సీఎంగా సచిన్ పైలట్.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్!

వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్షుడిగా బరిలోకి దిగనున్న గెహ్లోత్.. రాజస్తాన్ సీఎంగా కొనసాగాలని అనుకుంటున్నారట. ఇందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సోనియా స్పష్టం చేశారట. దీంతో తొందరలోనే రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవికి గెహ్లోత్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానంలో తన ప్రత్యర్థి అయిన సచిన్ పైలట్ రావడం గెహ్లోత్‭కు ఎంతమాత్రం ఇష్టం లేదు.

Sachin Pilot: రాజస్తాన్ సీఎంగా సచిన్ పైలట్.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్!

Sachin Pilot Gets Gandhis Backing For Rajasthan Chief Minister

Sachin Pilot: రాజస్తాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ తొందరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. ఏఐసీసీ అధ్యక్ష పదవీ రేసులో ఉండడంతో రాజస్తాన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించనట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో పైలట్‭కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గురువారం రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికపై ఆయన మాట్లాడుతూ ‘‘పదవికి ఎవరైనా పోటీ చేయోచ్చు. అయితే ఉదయ్‭పూర్ తీర్మానాన్ని జవదాటకూడదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం ఈ సమావేశంలో ‘ఒకరికి ఒక పదవి మాత్రమే’ అనే తీర్మానం కాంగ్రెస్ పార్టీ చేసింది. రాహుల్ గాంధీ పరోక్షంగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

Mohan Bhagwat: మసీదును సందర్శించిన RSS చీఫ్.. హిందూ, ముస్లిం DNA ఒకటే అంటూ స్టేట్‭మెంట్!

వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్షుడిగా బరిలోకి దిగనున్న గెహ్లోత్.. రాజస్తాన్ సీఎంగా కొనసాగాలని అనుకుంటున్నారట. ఇందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సోనియా స్పష్టం చేశారట. దీంతో తొందరలోనే రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవికి గెహ్లోత్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానంలో తన ప్రత్యర్థి అయిన సచిన్ పైలట్ రావడం గెహ్లోత్‭కు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ, పైలట్‭ను కాదని, వేరే వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చేసేందుకు అధిష్టానం సముఖంగా లేదు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు నామినేషన్లకు గడువు ఇచ్చారు. అనంతరం అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, ఈ పోటీలోకి దిగేందుకు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. అశోక్ గెహ్లోత్, శశి థరూర్ మధ్య ప్రధాన పోటీ ఉండనున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Bengal: నేను మగాడిని.. ED, CBI నన్ను టచ్ చేయొద్దు.. సువేంధుకు TMC నేత వినూత్న కౌంటర్