Maharashtra: షిండే ప్రభుత్వాన్ని ఉద్ధవ్ సేన డెత్ వారెంట్.. 15 రోజుల్లో కూలిపోతుందంటూ స్టేట్‭మెంట్

ఉద్ధవ్ థాకరే తనను మోసం చేశాడని, అందుకు తిరిగి సమాధానం చెప్పాలనని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్, ఎన్సీపీల వంచన చేరినందుకు ప్రభుత్వాన్ని తామే కూల్చామనే పరోక్షంగా చెప్పారు.

Maharashtra: షిండే ప్రభుత్వాన్ని ఉద్ధవ్ సేన డెత్ వారెంట్.. 15 రోజుల్లో కూలిపోతుందంటూ స్టేట్‭మెంట్

Shinde faction

Maharashtra: కేవలం 15 రోజుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదివారం రాష్ట్రంలోని జలగాం జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత కాలం క్రితం శివసేన మీద తిరుగుబాటు చేసిన ఏక్‭నాథ్ షిండే.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలడానికి కారణం అయ్యారు. అనంతరం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే షిండే ప్రభుత్వం మీద కూడా ప్రతీకారానికి ఉద్ధవ్ వర్గం ప్రణాళికలు వేస్తున్నట్లు చాలా కాలంగా వినిపిస్తోంది. అందులో భాగంగానే రౌత్ తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

HD Kumaraswamy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం.. కీలక సూచనలు చేసిన వైద్యులు

‘‘షిండే ప్రభుత్వాన్ని డెత్ వారెంట్ ఇస్తున్నా. కేవలం 15 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఇంతకు ముందే ఇది జరిగేది. కానీ సుప్రీంకోర్టు కేసుల వల్ల ఆలస్యం జరిగింది’’ అని రౌత్ అన్నారు. పైగా షిండేను బ్యాగ్ సర్దుకోమని బీజేపీ నేతలే చెప్పినట్లు షిండే అన్నారు. మహారాష్ట్రలో పరిస్థితులు కూడా రౌత్ అలాగే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉబలాటపడుతున్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ అప్పటి వరకు కుర్చీకోసం ఆగలేనని నిర్మొహమాటంగానే చెప్పారు. బీజేపీ మద్దతుతో అజిత్ పవార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Amritpal Singh Arrested: అమృత్‌పాల్ లొంగిపోలేదు.. అరెస్టు చేశాం.. వివరాలు వెల్లడించిన ఐపీజీ సుఖ్‌చైన్ సింగ్

ఉద్ధవ్ థాకరే తనను మోసం చేశాడని, అందుకు తిరిగి సమాధానం చెప్పాలనని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్, ఎన్సీపీల వంచన చేరినందుకు ప్రభుత్వాన్ని తామే కూల్చామనే పరోక్షంగా చెప్పారు. అయితే దీని మీద అప్పుడు ఉద్ధవ్ వర్గం పెద్దగా స్పందించలేదు. కానీ, షిండే ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాత్రం కంకణం కట్టుకొనే ఉన్నట్లు పార్టీ వర్గాలే బహిరంగంగా చెప్పుకున్నాయి. అయితే తమకు షిండే రాజకీయ ద్రోహం చేసినట్లు భావిస్తున్న ఉద్ధవ్ వర్గం.. ఆ ప్రభుత్వాన్ని కూల్చి బుద్ధి చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.