బియ్యం బాగాలేవంటే కేసులు పెడుతున్నారు : అచ్చెన్నాయుడు

వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం బాగాలేవని వాట్సాప్ లో ఫొటోలు పెడితే ప్రజలపై కేసులు పెడుతున్నారని అన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 07:14 AM IST
బియ్యం బాగాలేవంటే కేసులు పెడుతున్నారు : అచ్చెన్నాయుడు

వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం బాగాలేవని వాట్సాప్ లో ఫొటోలు పెడితే ప్రజలపై కేసులు పెడుతున్నారని అన్నారు.

వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం బాగాలేవని వాట్సాప్ లో ఫొటోలు పెడితే ప్రజలపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందని వాపోయారు. (2019, డిసెంబర్10) మంగళవారం సన్నబియ్యంపై అసెంబ్లీలో చర్చిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నబియ్యం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి అంటున్నారని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వ పెద్దలే చెప్పారని గుర్తు చేశారు అచ్చెన్నాయుడు. ఇచ్చిన మాట ఎందుకు తప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

తర్వాత సన్నబియ్యం బదులు నాణ్యమైన బియ్యం అని పేరు మార్చారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద పథకాన్ని అమలు చేశారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి బియ్యం సరఫరా చేశారని తెలిపారు. బియ్యం ధర కంటే రవాణా ఖర్చు ఎక్కువైందన్నారు. ప్లాస్టిక్ సంచుల్లో తీసుకురావడంతో బియ్యం పాడైపోయాయని చెప్పారు. 

అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఇప్పుడు ఎవరికీ సన్నబియ్యం సరఫరా చేయడం లేదని చొప్పుకొచ్చారు నాని. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన బియ్యాన్నే సరఫరా చేస్తున్నామని తెలిపారు. 

వాలంటీర్ల ద్వారా శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. రైలు మిల్లర్లే డబ్బులు తీసుకోకుండా బియ్యం ప్యాకింగ్ చేస్తున్నారని తెలిపారు. డబ్బులు తీసుకోవడం లేదు కాబట్టి అవినీతికి ఆస్కారం లేదన్నారు.