మున్సి పల్స్ : TRS జోరుకు కాంగ్రెస్, బీజేపీ బేజారు

  • Published By: madhu ,Published On : January 25, 2020 / 09:54 AM IST
మున్సి పల్స్ : TRS జోరుకు కాంగ్రెస్, బీజేపీ బేజారు

ఫలితాల్లో కారు జోరు చూపించింది. పట్టణ ఓటర్లంతా పట్టం కట్టడంతో టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీలకు గాను 109 మున్సిపాలిటీల్లో గెలుపు జెండా ఎగరేసింది. కార్పొరేషన్లలోనూ హవా చూపిస్తోంది. కారు జోరుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బేజారయ్యాయి. కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడ్డాయి. కాంగ్రెస్ నాలుగు మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకోగా… బీజేపీ రెండు… ఎంఐఎం ఒక్క మున్సిపాలిటీకి మాత్రమే పరిమితమయ్యాయి. మరో 9 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడగా.. నారాయణఖేడ్‌ ఫలితం రసకందాయంలో పడింది.

జగిత్యాలలో కాంగ్రెస్ కంచుకోటను టీఆర్ఎస్ బద్దలుకొట్టింది. మొదటిసారి జగిత్యాల మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడింది. భీమ్‌గల్‌, మరిపెడ, చెన్నూరు మున్సిపాలిటీల్లో కారు జోరుకు ప్రత్యర్థులు అడ్రస్ లేకుండా పోయారు. ఈ మూడు మున్సిపాలిటీల్లోనూ… కారు క్లీన్‌స్వీప్ చేసింది.అత్యధిక మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించగా… చాలా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిరిసిల్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ వశమైనా… ఇక్కడ రెబల్స్‌ రెండో స్థానంలో నిలవడం ఆసక్తి రేపింది.

కాంగ్రెస్ నాలుగు మున్సిపాలిటీల్లో గెలుపు జెండా ఎగరేసింది. వడ్డేపల్లి, యాదగిరిగుట్ట, నేరేడుచర్ల, ఆదిభట్ల మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. అటు.. బీజేపీ ఆమన్‌గల్‌ మున్సిపాలిటీని, ఎంఐఎం భైంసా మున్సిపాలిటీలను దక్కించుకున్నాయి.

ఇక… నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ ఫలితం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినా.. మున్సిపాలిటీని దక్కించుకునే పరిస్థితులు కనిపించట్లేదు. ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్‌కు 3 ఎక్స్అఫీషియో ఓట్లు ఉండటంతో.. ఈ మున్సిపాలిటీ కూడా గులాబీ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

అయిజ, చౌటుప్పల్, భువనగిరి, అమరచింత మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. అయిజలో ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థులు 10 వార్డుల్లో గెలుపొందగా… కాంగ్రెస్-5, టీఆర్ఎస్-5 వార్డులను గెల్చుకున్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ… టీఆర్ఎస్‌ 8 వార్డుల్లో గెలుపొందగా… కాంగ్రెస్ 5, సీపీఎం 3, బీజేపీ 3, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.

నిర్మల్‌ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మొత్తం 42 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌ 30, కాంగ్రెస్‌ 7, బీజేపీ 1, ఎంఐఎం 2, ఇండిపెండెంట్స్‌ 2 వార్డుల్లో గెలిచారు. కౌంటింగ్‌ మొదలైనప్పట్నుంచీ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది.

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలాకా అయిన హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ గెల్చుకుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా… 18చోట్ల విజయం సాధించింది. మరో మూడు వార్డుల లెక్కింపు మిగిలి ఉండగానే టీఆర్‌ఎస్‌ ఇక్కడ విజయం సాధించింది.

ఇటు కార్పొరేషన్లలోనూ గులాబీ గుబాళించింది. ఏడు కార్పొరేషన్లలో హవా కొనసాగిస్తోంది. జవహర్‌నగర్‌, మీర్‌పేట, బండ్లగూడ జాగీర్, పీర్జాదిగూడ, బడంగ్‌పేట్‌, బోడుప్పల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

రామగుండం కార్పొరేషన్‌లో హంగ్‌ ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా… అందులో టీఆర్‌ఎస్‌ 19, కాంగ్రెస్‌11, బీజేపీ ఐదు, ఇతరులు 15 స్థానాలు గెలిచారు. టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుపొందినప్పటికీ… కార్పొరేషన్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కావాల్సిన మెజారిటీ సాధించలేదు. దీంతో ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులు ఛైర్‌పర్సన్‌ ఎన్నికలో కీలక కానున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా గులాబీ గుబాళించింది. 11 మున్సిపాలిటీల్లో ఇప్పటిరకు 8 మున్సిపాలిటీలను దక్కించుకుంది. ఎంఐఎం భైంసాలో విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చినా… విజయం ఎంఐఎంనే వరించింది. టీఆర్‌ఎస్‌ ఒక్క స్థానంలోనూ గెలవకలేకపోయింది. కాంగ్రెస్‌ది కూడా అదే పరిస్థితి. మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15, బీజేపీ 9, స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డుల్ని కైవసం చేసుకున్నారు. ఖానాపూర్‌లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ టీఆర్‌ఎస్‌దే పైచేయిగా నిలిచింది. ఇక్కడ మొత్తం 18 మున్సిపాలిటీలుండగా.. పోచంపల్లి, ఆలేరు, మోత్కూరు, తిరుమలగిరి, కోదాడ మున్సిపాలిటీలు గులాబీ ఖాతాలో చేరాయి. ఈ జిల్లాలో కాంగ్రెస్ కూడా తన ఉనికిని చాటుకుంది. యాదగిరిగుట్ట, నేరేడుచర్ల మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. ఇక.. భువనగిరి, చౌటుప్పల్‌ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికారపార్టీ హవా కొనసాగింది. మొత్తం 17 మున్సిపాలిటీలకు గాను 7చోట్ల టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించగా… ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. కారు ఖాతాలో పెబ్బేరు, కొత్తకోట, అలంపూర్‌, గద్వాల్‌, ఆత్మకూరు, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలు చేరాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్ వశమైంది. కొల్లాపూర్‌, ఐజలో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ఆధిక్యం సాధించారు. 7 మున్సిపాలిటీల్లో హంగ్‌ నెలకొంది. భూత్‌పూర్‌, నారాయణపేట్, మక్తల్‌, కోస్గి, అమరచింత, కల్వకుర్తిల్లో హంగ్‌ నెలకొంది. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్ఎస్‌ దుమ్మురేపింది. తొమ్మిదికి మున్సిపాలిటీలకు గాను 8 కైవసం చేసుకుంది. డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు, మహబూబాబాద్‌, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. జనగామలో మాత్రం టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీచింది. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలకు గాను… టీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ 10, బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ 3 చోట్ల గెలుపొందారు.

కరీంనగర్‌ జిల్లాలోనూ కారు జోరు చూపించింది. ఉమ్మడి జిల్లాలో 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌ ఉండగా… 11 మున్సిపాలిటీల్లో విక్టరీ కొట్టింది. వేములవాడ, రాయికల్‌, ధర్మపురి, కొత్తపల్లి, సుల్తానాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, సిరిసిల్ల, పెద్దపల్లి మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ టీఆర్‌ఎస్‌దే పైచేయిగా నిలిచింది. ఇక్కడ మొత్తం 18 మున్సిపాలిటీలుండగా.. పోచంపల్లి, ఆలేరు, మోత్కూరు, తిరుమలగిరి, కోదాడ మున్సిపాలిటీలు గులాబీ ఖాతాలో చేరాయి. ఈ జిల్లాలో కాంగ్రెస్ కూడా తన ఉనికిని చాటుకుంది. యాదగిరిగుట్ట, నేరేడుచర్ల మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. ఇక.. భువనగిరి, చౌటుప్పల్‌ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ టీఆర్ఎస్‌కు ఎదురులేకుండా పోయింది. మొత్తం 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా… ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. భీమ్‌గల్‌, ఆర్మూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్‌ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా గులాబీ గుబాళించింది. 11 మున్సిపాలిటీల్లో ఇప్పటిరకు 4 మున్సిపాలిటీలను దక్కించుకుంది. మరికొన్ని మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అటు ప్రజల్లో, ఇటు పార్టీల్లో ఉత్కంఠ రేపిన భైంసా మున్సిపాలిటీ ఎంఐఎం వశమైంది. ఇక్కడ బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చినా… విజయం ఎంఐఎంనే వరించింది. టీఆర్‌ఎస్‌ ఒక్క స్థానంలోనూ గెలవకలేకపోయింది. కాంగ్రెస్‌ది కూడా అదే పరిస్థితి. మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15, బీజేపీ 9, స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డుల్ని కైవసం చేసుకున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికారపార్టీ హవా కొనసాగింది. మొత్తం 17 మున్సిపాలిటీలకు గాను 8చోట్ల టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించగా… ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. కారు ఖాతాలో పెబ్బేరు, కొత్తకోట, అలంపూర్‌, గద్వాల్‌, ఆత్మకూరు, కొడంగల్, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలు చేరాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్ వశమైంది. ఇక.. అయిజ, అమరచింత మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ మెజార్టీ వార్డులు దక్కకపోవడంతో హంగ్ ఏర్పడింది.

మెదక్‌ జిల్లాలోనూ టీఆర్ఎస్ హవా చూపించింది. 13 మున్సిపాలిటీలకు గాను… 8 మున్సిపాలిటీల్లో గెలుపొందింది. సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, అమీన్‌పూర్‌, బొల్లారం, నర్సాపూర్‌, గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలు టీఆర్ఎస్ ఖాతాలో చేరగా… నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ ఫలితం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినా.. మున్సిపాలిటీని ఆ పార్టీ దక్కించుకునే పరిస్థితులు కనిపించట్లేదు. ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్‌కు 3 ఎక్స్అఫీషియో ఓట్లు ఉండటంతో.. ఈ మున్సిపాలిటీ కూడా గులాబీ కోటలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

మేడ్చల్‌ జిల్లాలోనూ టీఆర్ఎస్ దూకుడు చూపించింది. మేడ్చల్‌, పోచారం, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, తూముకుంట, దుండిగల్‌, నాగారం మున్సిపాలిటీలో గులాబీ ఖాతాలో చేరగా… కొంపల్లి మున్సిపాలిటీలో హంగ్‌ ఏర్పడింది.

రంగారెడ్డి జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా… ఇప్పటివరకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఒక్కో మున్సిపాలిటీని దక్కించుకున్నాయి. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ వశమవగా… ఆదిభట్ల కాంగ్రెస్‌ హస్తగతమైంది. ఇక తుక్కుగూడ మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలో చేరింది.

ఖమ్మం జిల్లాలోనూ టీఆర్ఎస్‌ సత్తా చాటింది. సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది.
 

Read More : మున్సిపల్ ఫలితాలు : బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు నిరూపించారు