కృష్ణా జిల్లా టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్, నియోజకవర్గం మారాలని ఎందుకు అనుకుంటున్నారా?

గత 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తన నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 01:45 PM IST
కృష్ణా జిల్లా టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్, నియోజకవర్గం మారాలని ఎందుకు అనుకుంటున్నారా?

గత 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తన నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ

గత 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తన నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ ఆయనను ఢీకొట్టే వారే లేని పరిస్థితి. అలాంటిది రెండుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని వదిలేసి వేరే నియోజకవర్గానికి ఎందుకు షిఫ్ట్ అయిపోదామని అనుకుంటున్నారు? ఇక్కడ భవిష్యత్‌ లేదనుకున్నారా? తన బలంపై తానే నమ్మకం కోల్పోతున్నారా?

తక్కువ కాలంలో టీడీపీలో కీలక నేతగా ఎదిగిన దేవినేని ఉమ:
కృష్ణా జిల్లాలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు పొందిన దేవినేని ఉమా మహేశ్వరరావు.. తన దేవినేని రమణ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అతి తక్కువ కాలంలోనే టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 1999లో దేవినేని రమణ ఆకస్మిక మరణంతో నందిగామ నుంచి  మొదటిసారి పోటీ చేసిన ఉమా.. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1999, 2004లో నందిగామ నుంచి 2009, 2014లలో మైలవరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓటమి చెందారు. 2004 నుంచి జిల్లా పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. జిల్లా పార్టీ బాధ్యతలు సైతం మోశారు.

మంత్రిగా పని చేసిన కాలంలో ఉమా వ్యవహార శైలితోనే ఇబ్బందులు:
కృష్ణా జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు ఏ కార్యక్రమం పెట్టినా దేవినేని ఉమాయే భుజాన వేసుకొని సక్సెస్ చేశారు. విజయవాడలో జరిగే పార్టీ రాష్ట్ర కార్యక్రమాల బాధ్యతను కూడా ఉమా చూస్తుంటారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మంత్రిగా పని చేసిన ఐదేళ్లలో ఉమా వ్యవహరించిన తీరుతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఊరంతా అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను, నాయకులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఉమ నష్టపోయారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. 

వసంత నాగేశ్వరరావు, కృష్ణప్రసాద్‌ ధాటికి ఉమ తట్టుకోలేకపోతున్నారా?
దేవినేని ఉమకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. చంద్రబాబు తర్వాత కార్యకర్తలు అత్యధిక సెల్ఫీలు దిగేది దేవినేని ఉమతోనే అని అంటారు. అలాంటిది ఆయన… ఇప్పుడు వసంత కుటుంబం ధాటికి తట్టుకోలేక పోతున్నారట. ఒక పక్క వసంత నాగేశ్వరావు, మరోపక్క వసంత కృష్ణ ప్రసాద్ కలసి దేవినేని ఉమను రఫ్ ఆడిస్తున్నారని అనుకుంటున్నారు. వీరి ధాటికి తట్టుకోలేక ఏకంగా నియోజకవర్గం మారే ఆలోచనలో ఉమ ఉన్నారంటున్నారు. అసలు వసంత కుటుంబాన్ని ముందుగా రెచ్చగొట్టింది దేవినేని ఉమానే అని టీడీపీ నేతలే చెబుతున్నారు. 

నూజివీడుపై కన్నేసిన దేవినేని ఉమ:
గత ఎన్నికల్లోనే తాను నియోజకవర్గం మారితే గెలిచేవాడినని తన సన్నిహితులతో దేవినేని ఉమా చెప్పుకుంటున్నారట. దీనికి సంబంధించి పార్టీలో సీనియర్ అయిన మరో మాజీ ఎమ్మెల్యేతో దేవినేని ఉమ డిస్కస్ చేశారట. పనిలో పనిగా తాను మారుతాను, నువ్వు కూడా మారు అని ఆయనకు సలహా ఇచ్చారట ఉమా. ఆయన మాత్రం నువ్వు మారితే మారు నేను మాత్రం నియోజకవర్గాన్ని మారను అని గట్టిగానే చెప్పేశారట. ఇప్పుడు నూజివీడు నియోజకవర్గంపై ఉమా దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ కేడర్ బలంగా ఉన్నా సమర్థంగా నడిపించే నాయకుడు లేకపోవడంతోనే పార్టీ ఎప్పుడూ ఓడిపోతుందని నేతలు భావిస్తున్నారు.

గన్నవరం బాధ్యతలను ముద్రబోయినకు అప్పగిస్తారా?
ప్రస్తుతం నూజివీడు ఇన్‌చార్జిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు గన్నవరం బాధ్యతలు అప్పగిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. 2004లో ముద్రబోయిన గన్నవరం నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు. ఇప్పటికీ గన్నవరం నియోజకవర్గంలో ఆయనకు గట్టి పట్టుంది. ఎలాగోలా ముద్రబోయినను ఒప్పించి, నూజివీడులో దేవినేని ఉమా పాగా వేస్తారని కృష్ణా జిల్లా టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. దేవినేని ఉమ లాంటి వ్యక్తి నియోజకవర్గం మారితే పార్టీ కార్యకర్తలలో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.