8లక్షల ఓట్లు తొలగించాలని అప్లికేషన్లు : ఇది వైసీపీ పనే అన్న మంత్రి కాల్వ

అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు వివాదం దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్లు తొలగింపు కుట్ర వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారని

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 07:23 AM IST
8లక్షల ఓట్లు తొలగించాలని అప్లికేషన్లు : ఇది వైసీపీ పనే అన్న మంత్రి కాల్వ

అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు వివాదం దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్లు తొలగింపు కుట్ర వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారని

అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు వివాదం దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్లు తొలగింపు కుట్ర వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తే.. ఆ పని చేస్తోంది మీరే అని టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఏపీలో 8లక్షల ఓట్లను తొలగించేందుకు ఫామ్-7 ద్వారా వైసీపీ నేతలు దరఖాస్తు చేశారని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read : నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్

వైసీపీ అధినేత జగన్.. తన స్వార్థ ప్రయోజనాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా మారాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంపై విషం చిమ్ముతున్న వారి చేతిలో జగన్ పావుగా మారారని అన్నారు. ప్రధాని మోడీ డైరెక్షన్ లో సీఎం కేసీఆర్ తో కలిసి హైదరాబాద్ కేంద్రంగా జగన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కాల్వ అన్నారు. తెలంగాణలో ఏపీ అంతర్భాగమని అనుకుంటున్నారా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఏపీలో బలహీనమైన ప్రభుత్వాన్ని తెచ్చేందుకు కుట్ర జరుగుతోందని, మోడీ దుష్ట ఆలోచనలు ఏపీ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని మంత్రి అన్నారు.

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల తొలగింపు కుట్ర వివాదం తారస్థాయికి చేరుకుంది. ఫారం 7 ఉపయోగించుకొని అక్రమంగా ఓట్ల తొలగింపుకి పాల్పడుతున్నది మీరు అంటే కాదు మీరే అంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓట్ల తొలగింపునకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తుండటం సంచలనంగా మారింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల సంఘాన్నే బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల జాబితాలో నుంచి తమ పేరు తొలగించాలంటూ ఓటర్లకు తెలియకుండానే వారి పేరిట ఎన్నికల సంఘానికి కొందరు భారీ ఎత్తున దరఖాస్తులు పెడుతున్నారు. 10 రోజుల్లో ఎన్నికల సంఘానికి లక్షల సంఖ్యలో ఫారం-7 అప్లికేషన్లు వెల్లువెత్తాయి.

ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దరఖాస్తులు 8.72 లక్షల అందాయి. వీటిలో 90 శాతం 10 రోజుల వ్యవధిలో ఆన్‌లైన్‌లో వచ్చినవే. గుంటూరు జిల్లాలో 1.17 లక్షలు, చిత్తూరులో 1.09 లక్షల మంది పేరిట ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేశారంటే ఇది ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది.
Also Read : దబిడిదిబిడే : బాలకృష్ణనే అడ్డుకున్న మహిళలు