కరోనా ఉన్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయం

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ఉన్నా బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 05:30 AM IST
కరోనా ఉన్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయం

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ఉన్నా బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ఉన్నా బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిబంధనలకు అనుగుణంగా కరోనా పాజిటివ్‌ ఉన్నప్పటికీ మూడు రోజుల పాటు లక్షణాలు(దగ్గు, జలుబు) లేని 50 ఏళ్లలోపు వయస్సున్న వారిని హోం క్వారంటైన్‌కు(ఇంటికి) తరలించాలని ఆరోగ్య శాఖ డెసిషన్ తీసుకుంది. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్‌-19కు చికిత్స పొందుతున్న రోగుల్లో అలా లక్షణాలు లేని వారిని 393 మందిని గుర్తించారు. తమ ఇళ్లల్లో ప్రత్యేక గది వసతి కలిగున్న 310 మందిని హోంక్వారంటైన్​కు, మిగతా 83 మందిని అమీర్​పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించారు.

గాంధీ నుంచి 393 మంది కరోనా రోగులు తరలింపు:
ఎంపిక చేసిన కరోనా బాధితులను 3 బస్సులు, 30 అంబులెన్సుల్లో హోంక్వారంటైన్ కు తరలించామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు చెప్పారు. వీరంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని.. వారిపై హెల్త్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. బాధితులు ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే కోవిడ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. బాధితుల చేతిపై హోం క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నామని, ప్రత్యేకంగా రూపొందించిన హోం ఐసోలేషన్‌ కిట్లను అందిస్తున్నామన్నారు. హోం క్వారంటైన్‌కు తరలించిన కరోనా బాధితుల్లో పోలీసులు, జర్నలిస్టులు, వైద్య సిబ్బంది ఉన్నారు. కాగా, ప్లాస్మాథెరపీతో ఐదుగురు బాధితులు కోలుకున్నారని, వీరిలో ఒకరిని ఇటీవలే డిశ్చార్జి చేశామన్నారు. ఐసీయూలో ప్రాణాపాయస్థితిలో ఉన్న సుమారు 50 మందికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని రాజారావు వెల్లడించారు.

కరోనా రోగులతో గాంధీ కిటకిట:
రోజూ వందల సంఖ్యలో పాజిటివ్‌ రోగులు వచ్చి చేరటంతో నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి కిటకిటలాడుతోంది. గాంధీలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య గడిచిన వారం రోజులుగా పెరుగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా కరోనా పాజిటివ్‌ ఉన్నప్పటికీ మూడురోజుల పాటు లక్షణాలు లేని 50 ఏళ్లలోపు వయస్సున్న వారిని హోం క్వారంటైన్‌కు తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో 3742 కరోనా కేసులు, 142 మరణాలు:
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. సోమవారం(జూన్ 8,2020) 92 కొత్త కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది. కరోనాతో మరో ఐదుగురు మరణించారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3వేల 742కి చేరింది. కరోనాతో బాధపడుతూ ఇప్పటి వరకు 142 మంది మరణించారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

Read: తెలంగాణలో కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి