Gnanavatarulu Sri Yukteswar Giri : భయం ముఖంలోకి చూడండి..అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది : జ్ఞానావతారులు శ్రీ యుక్తేశ్వర్ గిరి దివ్య సందేశాలు

భయం..భయం భయం.. ఇది మనిషిని ఉన్నతిని అవరోధం. ఆ భయాన్ని ఎలా జయించాలో..దాన్ని ఎలా ఎదుర్కోవాలో విద్యార్ధులకు నేర్పించిన గొప్ప గురువు శ్రీ జ్ఞానావతారులు శ్రీ యుక్తేశ్వర్ గిరి.

Gnanavatarulu Sri Yukteswar Giri : భయం ముఖంలోకి చూడండి..అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది : జ్ఞానావతారులు శ్రీ యుక్తేశ్వర్ గిరి దివ్య సందేశాలు

Gnanavatarulu Sri Yukteswar Giri

Gnanavatarulu Sri Yukteswar Giri : భయం..భయం భయం.. ఇది మనిషిని ఉన్నతిని అవరోధం. అందుకే దాన్ని జయించి ముందుకు అడుగు వేయండీ విజయాలు మీముందు సలామ్ కొడతాయి అని ఎంతోమంది అనుభవజ్ఞులు చెప్పిన మాట. వారు స్వయంగా అనుభవించి చెప్పిన సూచనలు నేటి తరానికే కాదు రానున్న తరాలకు కూడా మార్గదర్శకాలు అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. అటువంటి గొప్ప వ్యక్తి ‘భయం ముఖంలోకి చూడండి..అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది’ అని భరోసా ఇచ్చిన గొప్ప వ్యక్తి శ్రీ జ్ఞానావతారులు శ్రీ యుక్తేశ్వర్ గిరి. ఆయన 168వ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన గొప్ప వాక్కుల గురించి ప్రతీ మనిషి జీవితంలో వచ్చే అవరోధాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పిన దివ్య సందేశాల గురించి తెలుసుకుందాం..

“భయం ముఖంలోకి చూడండి, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది” బెంగాల్ దివ్య సింహం జ్ఞానావతారులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి వ్యాఖ్యలివి. పడమర దేశాలలో యోగపితామహుడిగా పిలిచే పరమహంస యోగానంద దివ్య గురువులు. ఆధ్యాత్మిక కళాఖండమైన ‘ఒక యోగి ఆత్మ కథ’ లో యోగానంద తమ గురువు లోతు కనిపెట్టలేని స్వభావం గురించి పరిశోధిస్తూ, ఒక దివ్య పురుషుని గురించి వేదాలు ఇచ్చిన నిర్వచనానికి తమ గురువు సరిగా సరిపోతారని చెప్పారు. కరుణ చూపించడంలో పుష్పం కన్నా మృదువుగాడగా ఉండాలని..సిద్ధాంతాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పిడుగు కన్నా బలంగా ఉండాలంటారు ఆయన. దాన్నే అనుసరించి చూపిచారు.

బెంగా‌ల్‌లోని శ్రీరాంపూర్‌లో 1855, మే 10వ తేదీన ప్రియానాధ్ కరా‌ర్‌గా జన్మించిన జ్ఞానావతారులు శ్రీ యుక్తేశ్వర్ గిరి బెనారస్‌లోని మహోన్నత యోగి అయిన లాహిరీ మహాశయుల శిష్యులయారు. తర్వాత స్వామి సంప్రదాయంలో చేరి శ్రీయుక్తేశ్వర్ గిరి అనే నూతన నామధేయాన్ని స్వీకరించారు. మేధాపరమైన, ఆధ్యాత్మిక పరమైన విద్యలో ఆయన ఆజన్మాంతం ఆసక్తి కలిగి ఉండడంతో తన పూర్వీకుల భవనాన్ని విద్య నేర్పే ఆశ్రమంగా మార్చారు. విద్య మనిషికి ఎంత అవసరమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జ్ఞానావతారులు శ్రీ యుక్తేశ్వర్ గిరి సంరక్షణలో ఉన్న శిష్యులందరూ ప్రాచ్య, పాశ్చాత్య దేశాలలోని ఉత్తమ లక్షణాలకు అనుసంధాన కర్తలుగా సునిశితంగా శిక్షణ పొందారు. పరిపూర్ణతను కోరుకునే వ్యక్తి కావడం వలన శ్రీ యుక్తేశ్వర్ గిరి పద్ధతులు తరచుగా తీవ్రంగా ఉండేవని పరమహంస యోగానంద చెప్పేవారు.

శ్రీ యుక్తేశ్వర్ భారతదేశంలోని శ్రీరాంపూర్‌లో మే 10, 1855న సంపన్న వ్యాపారవేత్తకు జన్మించారు. అతనికి ప్రియా నాథ్ కరార్ అని పేరు పెట్టారు. కాలేజీని విడిచిపెట్టిన తరువాత, అతను వివాహం చేసుకున్నాడు ఒక కుమార్తెకు తండ్రి అయ్యారు. 1884లో అతను లాహిరి మహాశయుని శిష్యుడు అయ్యాడు. అతని భార్య మరణం తరువాత, ప్రియ నాథ్ కరార్ స్వామిగా అవతరించి శ్రీ యుక్తేశ్వర్ గిరి అనే పేరు పొందారు.

అతను 1894లో లాహిరి మహాశయుని గురువైన బాబాజీని కలిశాడు. ఒకరోజు తాను శ్రీ యుక్తేశ్వర్‌ను పాశ్చాత్య దేశాలలో యోగ బోధనలను పంచుకునే శిష్యుడిని పంపుతానని బాబాజీ అతనికి చెప్పాడు. ఈ శిష్యుడు పరమహంస యోగానందగా మారాడు, ఇతను యోగి యొక్క స్వీయచరిత్ర అనే పుస్తకానికి ప్రసిద్ధి చెందాడు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ గ్రంథమైన బైబిల్,భగవద్గీత ముఖ్యమైన ఐక్యతపై ఒక పుస్తకాన్ని రాయమని బాబాజీ శ్రీ యుక్తేశ్వర్‌ను కూడా కోరాగా..శ్రీ యుక్తేశ్వర్ ఈ పుస్తకాన్ని రచించి దానికి ది హోలీ సైన్స్ అనే పేరు పెట్టారు .

శ్రీ యుక్తేశ్వర్ రెండు సన్యాసాలను స్థాపించారు. అందులో ఒకటి అతని తండ్రి వారసత్వంగా ఇచ్చిన అతని ఇల్లు. తన జీవితపు చివరి సంవత్సరంలో, శ్రీ యుక్తేశ్వర్ తన ఆస్తులన్నింటినీ పరమహంస యోగానందకు అప్పగించారు. వాటిని నిర్వహించడానికి ఎవరినైనా కనుగొనమని కోరాడు. శ్రీ యుక్తేశ్వర్ మార్చి 9, 1936న తన శరీరాన్ని విడిచిపెట్టారు.