Ganesh Chaturthi 2023 : భూగర్భంలో బొజ్జ గణపయ్య .. చెవిలో చెబితే కోరికలు తీర్చే స్వామి

భూగర్భంలో ఉండే బొజ్జ గణపయ్య కోరిక కోరికలు తీరుస్తాడు. మనస్సులో ఏదైనా అనుకుని ఆ కోరికను గణపయ్య చెవిలో చెబితే ఆ కోరిక నెరవేరుతుందట..

Ganesh Chaturthi 2023 : భూగర్భంలో బొజ్జ గణపయ్య .. చెవిలో చెబితే కోరికలు తీర్చే స్వామి

bikkavolu ganesh temple

వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు బొజ్జగణపయ్య. వక్రతుండ అంటూ తొండం వంకరగా ఉండే గణపయ్య అని అర్థం. కోటి సూర్యసమ ప్రభ అంటే కోటి సూర్యుల సమానంతో వెలుగొందేవాడు అని అర్థం. ఇలా వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. ఒక్కో పేరుకు ఒక్క అర్థం ఉంది పరమార్థం ఉంది. దేవతలతో కూడా పూజింపబడేవాడు వినాయకుడు. అంటే వినాయడకుడికి ఉందే శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడుని దేవతలు కూడా పూజిస్తారు. అంత గొప్పతనం..ఆ ప్రత్యేకత ఒక్క వినాయకుడికే ఉంది.

దేశ వ్యాప్తంగా వినాయకుడికి ఎన్నో దేవాలయాలున్నాయి. చాలా దేవాలయానికి ఘన చరిత్ర ఉంది. స్వయంభూగా వెలసని దేవాలయాలు ఎంతో ప్రసిద్ది చెందాయి. సాక్షాలు చెప్పే సాక్షి గణపతి. నీటిలో ఉండే గణపతి ఇలా ఎన్నో రకాలుగా కొలువైన వినాయకుడు భక్తులకు కొంగుబంగారంలో వెలుగొందుతున్నాడు. అలాంటి గొప్ప వినాయకుడి దేవాలయాల్లో తూర్పుగోదావరి జిల్లా ( East Godavari District )బిక్కవోలు( bikkavolu )లోని ఉండే దేవాలయం ఒకటి.

Ganesh Chaturthi 2023 : బొజ్జ గణపయ్యకు బోలెడన్ని పేర్లు .. వాటి అర్థాలు, పరమార్ధాలు

శ్రీలక్ష్మీగణపతి(lakshmiganapathi temple)గా పూజలందుకుంటున్నాడు ఇక్కడ స్వామి. క్రీ .శ 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్న ఈ దేవాలయంలో కొలువైన వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందనంటారు. ఈ దేవాలయం స్థంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. అంటే ఈదేవాలయం పురాతన చరిత్ర గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

ఈ దేవాలయం అప్పట్లో భూగర్భంలో ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించిన గణపయ్య తాను భూగర్భంలో ఉన్నానని చెప్పాడట. ఆ విషయాన్ని ఆ భక్తుడు గ్రామంలో అందరికి చెప్పాడట. దీంతో అందరు కలిసి తవ్వ స్వామి బయటపడ్డాడరని కథనాలు చెబుతున్నాయి. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగిందని చెబుతున్నారు స్థానికులు. ఈ వినాయకుడికి ఉన్న అత్యంత ప్రత్యేకత ఏమిటంటే..భక్తులు తమ మనసులోని కోరికలను స్వామి చెవిలో చెబితే ఆ కోరికలు తీరిపోతాయట. ఈ ఆలయంలో ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులు నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించినవారికి స్వామి అండగా ఉంటారని భక్తులు నమ్మకం. ఇక్కడ గణపతికి తొండం కుడివైపుకు ఉండటం విశేషం. అందుకే లక్ష్మీ గణపతి అంటారు. వినాయకుడి తొండం కుడివైపు తొండం తిరిగి ఉంటే.. లక్ష్మీగణపతి అంటారు. తొండం లోపల వైపునకు ఉంటే తపోః గణపతి అంటారు.

Ganesh Chaturthi 2023 : భారతదేశంలో ప్రముఖ వినాయక దేవాలయాలు ఇవే..