భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి : నేడు శ్రీరామావతారం

భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి : నేడు శ్రీరామావతారం

Mukkoti Ekadashi in Bhadradri : భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు కన్నులపండుగగా సాగుతున్నాయి. రోజుకొక అవతారంలో స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా..2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం..శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయం నుంచి బయలుదేరి..చిత్రకూట మండపానికి తీసుకరానున్నారు ఆలయ అర్చకులు. అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతినిస్తారు.

ఉత్సవాల్లో భాగంగా..డిసెంబర్ 24వ తేదీ ఆలయ పుష్కరిణిలో లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం జరుగనుంది. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా…డిసెంబర్ 25వ తేదీ..శుక్రవారం…తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వారం నుంచి భద్రాద్రి రామయ్య…భక్తులకు దర్శనమివ్వనున్నారు. 25వ తేదీ వరకు ఆలయ అధికారులు నిత్య కళ్యాణాలు నిలిపివేశారు. కరోనా వైరస్ కారణంగా..ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతి లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. 2020, డిసెంబర్ 15వ తేదీ నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 23 వరకు భద్రాద్రి రామయ్య వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.