21వేల మంది చిన్నారులతో ముంబై ఇండియన్స్ మ్యాచ్

సెంటిమెంట్‌లకు కాదేదీ అతీతం. వ్యాపారంలో, సినిమా రంగంలో, క్రీడా రంగంలో ఇలా ప్రతి రంగంలోనూ వాటి పాత్ర ప్రత్యేకమే.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 12:21 PM IST
21వేల మంది చిన్నారులతో ముంబై ఇండియన్స్ మ్యాచ్

సెంటిమెంట్‌లకు కాదేదీ అతీతం. వ్యాపారంలో, సినిమా రంగంలో, క్రీడా రంగంలో ఇలా ప్రతి రంగంలోనూ వాటి పాత్ర ప్రత్యేకమే.

సెంటిమెంట్‌లకు కాదేదీ అతీతం. వ్యాపారంలో, సినిమా రంగంలో, క్రీడా రంగంలో ఇలా ప్రతి రంగంలోనూ వాటి పాత్ర ప్రత్యేకమే. ఐపీఎల్ సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతి సీజన్‌లోనూ ఒక్క గేమ్‌లో చిన్నారులతో కలిసి సందడి చేస్తుంది ముంబై ఇండియన్స్. ఇలా చిన్న పిల్లలంతా స్డేడియానికి వచ్చి మ్యాచ్ చూస్తే ఆ గేమ్ గెలుస్తాం అనే సెంటిమెంట్ ముంబై ఇండియన్స్ లో పాతుకుపోయింది. 
Read Also : శ్రేయాస్ అయ్యర్‌కు తలనొప్పిగా మారిన ఢిల్లీ గాయాలు

నీతా అంబానీ ఐపీఎల్ సీజన్ మధ్యలో ఉండగా ఒక్క మ్యాచ్‌కు చిన్నారులతో కలిసి స్టేడియానికి వస్తారు. అంతే ఇక ఆ మ్యాచ్‌లో ముంబైకు విజయం ఖాయమన్నమాట. ఇలా చిన్నారులను తీసుకుని ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్ జరిగే ముంబై ఇండియన్స్‌కు మధ్య జరగనున్న మ్యాచ్‌కు చిన్నారులంతా హాజరుకానున్నారంట. 

ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘చదువు.. క్రీడలు రెండింటి మధ్య పార్టనర్‌షిప్ పిల్లలను సక్సెస్‌ఫుల్ ఫ్యూచర్ వైపుకు నడిపిస్తాయి. ఈఎస్ఏ ముంబై ఇండియన్స్‌ను స్పాన్సర్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఏప్రిల్ 13న జరిగే మ్యాచ్‌లో 21వేల మంది చిన్నారులు వస్తున్నారు. వాళ్ల చిరునవ్వులను చూసేందుకు ఎదురుచూస్తున్నా’ అని రోహిత్ పోస్టు చేశాడు.  
Read Also : గుడ్ న్యూస్ : ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులు