Ambati Rayudu: ఐపీఎల్‌కు అంబటిరాయుడు రిటైర్మెంట్

అంబటి రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్ పై ట్విట్టర్ లో పోస్టు పెట్టేశాడు. కాకపోతే కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి తూచ్ అని మాట వెనక్కు తీసుకున్నాడు.

Ambati Rayudu: ఐపీఎల్‌కు అంబటిరాయుడు రిటైర్మెంట్

Mabati Rayudu

 

 

Ambati Rayudu: అంబటి రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్ పై ట్విట్టర్ లో పోస్టు పెట్టేశాడు. కాకపోతే కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి తూచ్ అని మాట వెనక్కు తీసుకున్నాడు. డిలీట్ చేసిన ట్వీట్ లో ఈ 36ఏళ్ల ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అతని ఐపీఎల్ కెరీర్ లో కీలక పాత్ర పోషించిన జట్లు కావడంతో ప్రస్తావించినట్లుగా కనిపిస్తుంది.

“ఇదే నా లాస్ట్ ఐపీఎల్ అని చెప్పడానికి సంతోషిస్తున్నా. 13ఏళ్లుగా రెండు గొప్ప జట్లుకు ఆడినందుకు అద్భుతంగా ఫీల్ అవుతున్నా. ముంబై ఇండియన్స్, సీఎస్కే లతో వండర్ ఫుల్ జర్నీ గురించి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా” అని ట్వీట్ లో పేర్కొన్నాడు రాయుడు.

రాయుడు 2010లో MI జట్టు ద్వారా టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టాడు. MI అందుకున్న ఐదు టైటిల్ విజయాలలో మొదటి సీజన్ 2013లో అన్ని మ్యాచ్‌లలో మెరిశాడు అంబటి.

Read Also: ఐపీఎల్‌కు రైనా రిటైర్మెంట్!!

2018 సీజన్‌లో CSKకి వెళ్లడానికి ముందు, చివరి సీజన్‌లో ఐదుసార్లు మాత్రమే ఆడాడు. MS ధోని నేతృత్వంలోని జట్టులో రాయుడు పవర్-హిటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2018, 2021లో టైటిల్ గెలిచిన జట్లలో అంతర్భాగంగా ఉన్నాడు.