Ind vs Aus 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో మనదే పైచేయి

Ind vs Aus 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో మనదే పైచేయి

Ind vs Aus 1st Test Match: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టే పైచేయి సాధించింది. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్ లో ఆసీస్ ఆటగాళ్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. నాలుగు వికెట్లు తీసుకున్న అశ్విన్ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లను పరుగులు పెట్టే వీల్లేకుండా కట్టడి చేశాడు. భూమ్రా రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్ మూడు రెండు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియా ఆటగాళ్లు పెద్ద స్కోరు చెయ్యకుండా ఆపగలిగారు. దీంతో 191పరుగులకే ఆస్ట్రేలియా జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ ముగించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 244పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా జట్టు 53పరుగులు వెనకబడి ఉంది. కెప్టెన్ టిమ్ పైన్ మాత్రమే 73పరుగులతో రాణించాడు. మార్నస్ లాబుస్చాగ్నే 47పరుగుల ఇన్నింగ్స్ కొంతవరకు జట్టు స్కోరుకు సాయపడింది. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది, కాని పృథ్వీ షా మొదటి ఇన్నింగ్స్‌లో మ్యాచ్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని వికెట్ మిచెల్ స్టార్క్ తీసుకోగా.. మయాంక్ అగర్వాల్ పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మయాంక్ 40 బంతుల్లో 17 పరుగులకు అవుటయ్యాడు. 160 బంతుల్లో 43 పరుగులు చేసిన తర్వాత చేతేశ్వర్ పుజారా అవుట్ అవగా… భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 74 పరుగుల ఇన్నింగ్స్ జట్టు స్కోరు 244కు చేరేందుకు సాయం చేసింది. వైస్ కెప్టెన్ అజింక్య రహానె 42 పరుగులకు అవుటయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా తరఫున నాలుగు వికెట్లు తీయగా.., పాట్ కమ్మిన్స్ మూడు, జోస్ హాజిల్ వుడ్ , నాథన్ లియోన్ చెరొక వికెట్ తీసుకున్నారు.