Azharuddin : నేనే… ప్రెసిడెంట్, అన్ని పవర్స్ ఉన్నాయి

ప్రస్తుతం నేనే... ప్రెసిడెంట్, అన్ని పవర్స్ ఉన్నాయని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ గా అజారుద్దీన్‌ను తొలగిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై 2021, జూన్ 17వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Azharuddin : నేనే… ప్రెసిడెంట్, అన్ని పవర్స్ ఉన్నాయి

Hca

Azharuddin Vs Apex council : ప్రస్తుతం నేనే… ప్రెసిడెంట్, అన్ని పవర్స్ ఉన్నాయని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ గా అజారుద్దీన్‌ను తొలగిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై 2021, జూన్ 17వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బోర్డ్ తో మాట్లాడి… HCA బాడీని డిసాల్వ్ చేస్తానని, అమైడ్స్ మెయిన్ కావాలనే తనకు నోటీసులు ఇచ్చిందన్నారు. తాను HCAని కంట్రోల్ చేయాల్సి ఉందని, ఎందుకంటే తాను అధ్యక్ష పదవిలో ఉన్నట్లు తెలిపారు. ఇందులో జరుగుతున్న… అవినీతిని అరికట్టడానికి సమర్థవంతమైన వ్యక్తిని అంబుడ్స్ మెన్ గా నియమిస్తే…. ఆ ఐదుగురే తప్పు పట్టారని ఆరోపించారు.

తప్పుడు పనులు..అవినీతి ఆరోపణలు : –
తప్పుడు పనులు, వాళ్ళ అవినీతి బయట పడుతుందనే భయంతో తనపై బురద జల్లుతున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ లో 9 మంది ఉంటే 5 మంది ఒక వర్గంగా ఏర్పడ్డారని, వీరి ఆగడాలు అడ్డుకోవాలని చూస్తున్న తనపై బురద చల్లుతున్నారన్నారు. కమిటీ సభ్యులు అవినీతిలో కూరుకపోయారని, విజయ ఆనంద్, వైస్ ప్రసిడెంట్ జాన్ మనోజ్ పై అవినీతి కేసులు నమోదు అయ్యాయన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి కూడా ఆ ఐదుగురు హాజరు కారని, జాన్ మనోజ్, విజయనంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ ఈ ఐదుగురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారాయన. వీళ్ళ అవినీతికి తాను అడ్డుపడుతున్నానని, వాళ్లకు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని వివరించారు.

తప్పుడు పనులు..అవినీతి ఆరోపణలు : –
ఒకేరోజు విజయ ఆనంద్, జాన్ మనోజ్, తన సభ్యులు కావాలనే రహస్యంగా మీటింగ్ ఏర్పాటు చేసి అపెక్స్ కౌన్సిల్ ద్వారా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వెల్లడించారు. 25 ఏళ్లుగా తాను క్రికెట్ కు సేవలు అందించడం జరుగుతోందని, గడిచిన 30 ఏళ్లుగా హెచ్ సి ఏ పై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించిన అజారుద్దీన్…క్రికెట్ గురించి తెలవని వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. తాను క్రికెట్ అభివృద్ది చేయడానికి వచ్చానని, గతంలో అధ్యక్షులుగా ఉన్న వారు పాలకులుగా ఉన్న వారు ఎందుకు గ్రౌండ్ లను ఎర్పాటు చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. రూ. 4 కోట్లు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఉప్పల్ గ్రౌండ్ లో నాసిరకం పనుల వల్ల చెడ్డ పేరు వచ్చిందని, అండర్ 19 లో కోచింగ్ ఇస్తే తనపై ఆరోపణలు చేశారని వెల్లడించారు.

బాధ్యత లేదా : –
ఓ క్రికెటర్ గా తనపై బాధ్యత లేదా ? కోచింగ్ ఇవ్వడం..ప్లేయర్స్ తో మాట్లాడవద్దా అంటూ మరోసారి ప్రశ్నించారు అజారుద్దీన్. తనకు క్లబ్ సెక్రెటరీలతో ఎలాంటి విబేధాలు లేవని, కోర్టు గౌడ్ లైన్ ద్వారా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశానని చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నట్లు..తాను మాత్రం అంబడ్స్ మెన్ ఆదేశాలు పాటిస్తానన్నారు. మరి అంబుడ్స్ మెన్ ఇచ్చే ఆదేశాలు ఎందుకు కమిటీ సభ్యులు పాటించడం లేదని మరోసారి ఆయన ప్రశ్నించారు. దుబాయ్ లో క్రికెట్ క్లబ్ కు కామెంటర్ గా ఉన్నా తాను ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదని వివరించారు. బీసీసీఐకి అన్ని క్లియర్ గా తెలుసన్న ఆయన అసలు విషయాలు పక్కన పెట్టి అసోసియేషన్ సభ్యులు కావాలనే ఇష్యూ చేస్తున్నారని తెలిపారు.

బ్లాక్ మెయిల్స్ కు భయపడను : –
తాను ఎలాంటి బ్లాక్ మెయిల్స్ కి భయపడనని, AGM మీటింగ్ పెట్టుకున్నట్లు, దీపక్ వర్మని అంబుడ్స్ మెన్ గా నియమించుకున్నామన్నారు. అందరూ అంగీకారం తెలిపారు..అయితే..పది నిమిషాల్లోనే తాను లేకుండా మరో మీటింగ్ పెట్టుకుని… దీపక్ వర్మ నియామకం చెల్లదు అని డిసైడ్ చేసుకున్నారని తెలిపారు. HCAలో ఏం జరుగుతుందో… BCCIకి అన్నీ తెలుసని, ఈ విషయంపై తాను కూడా BCCIకి వివరిస్తానన్నారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఇప్పటికే.. అంబుడ్స్ మెన్ నుంచి నోటీసులు వెళ్లాయని అజారుద్దీన్ వెల్లడించారు.