Women’s IPL: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంచైజీ వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ.. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లు

మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. త్వరలోనే ఐదు ఫ్రాంచైజీలకు వేలం నిర్వహించబోతుంది. ప్రతి ఫ్రాంచైజీ కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించింది.

Women’s IPL: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంచైజీ వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ.. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లు

Women’s IPL: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2023 మార్చి నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఈ ఐపీఎల్ కోసం కనీసం ఐదు జట్లకు అవకాశం కల్పించనుంది బీసీసీఐ. దీంతో ఐదు ఫ్రాంచైజీల కోసం త్వరలో పోటీ నిర్వహించనున్నారు.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

దీని కోసం కనీస ధరను రూ.400 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. మహిళల క్రికెట్‌కు ఉండే ఆదరణ, ఇతర అంశాలపై అధ్యయనం చేసిన బీసీసీఐ రూ.400 కోట్లను కనీస ధరగా నిర్ణయించింది. 2007-08లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ రూ.446 కోట్లు (111.9 మిలియన్ డాలర్లు)కు అమ్ముడుపోయింది. అప్పుడు డాలర్‌తో రూపాయి మారక విలువ రూ.40. ఇప్పుడు ఈ విలువ రూ.80కి పైగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం 50 మిలియన్ డాలర్లను కనీస ధరగా నిర్ణయించింది. అంటే అప్పటి డాలర్లలో సగం ధరే. కానీ, ఇప్పుడు డాలర్ విలువ ఎక్కువ ఉండటంతో ఈ ఫ్రాంచైజీల ధర కూడా రూ.400 కోట్లుగా ఉంది. ఐదు జట్లకు సంబంధించిన వేలం త్వరలోనే నిర్వహిస్తారు.

China: చైనాలో కోవిడ్ నిబంధనల పేరుతో ఇంట్లోనే ఉంచి తాళం వేసిన అధికారులు.. అగ్ని ప్రమాదంలో ఆహుతైన కుటుంబం

జట్ల ఎంపిక పూర్తైన తర్వాత ఆటగాళ్లను ఎంపిక చేసి, వేలం నిర్వహిస్తారు. ఈ ఫ్రాంచైజీల అమ్మకాల ద్వారా కనీసం రూ.6,000 కోట్ల నుంచి రూ.8,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ అంచనా. ప్రతి జట్టు కనీసం రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు అమ్ముడుపోవచ్చని భావిస్తోంది. ఈసారి ఏ సంస్థలు ఫ్రాంచైజీల కోసం పోటీ పడతాయి.. ఏయే జట్లు పోటీలో ఉంటాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.