BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్..అందరి చూపు సింధు వైపు

రెండేళ్ల పాటు ప్రపంచ ఛాంపియన్ గా కొనసాగిన తెలుగమ్మాయి...మరో సంవత్సరం ఆ హోదాను అనుభవిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ అందిరీలో నెలకొంది.

BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్..అందరి చూపు సింధు వైపు

Bwf

PV Sindhu : ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం కానున్నాయి. రెండోసారి టైటిల్ విజేతగా నిలవాలని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఉవ్విల్లూరుతున్నారు. 2019లో ఆమె కల నెరవేరింది. అయితే..కరోనా కారణంగా..పోటీలు రద్దయిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు ప్రపంచ ఛాంపియన్ గా కొనసాగిన తెలుగమ్మాయి…మరో సంవత్సరం ఆ హోదాను అనుభవిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ అందిరీలో నెలకొంది. మరోస్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా టోర్నీకి దూరంగా ఉన్నారు. 2021, డిసెంబర్ 12వ తేదీ బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. ఈనెల 19వ తేదీ వరకు జరుగనున్నాయి.

Read More : Omicron Victims Recover : మహారాష్ట్రలో కోలుకుంటున్న ఒమిక్రాన్ బాధితులు..ఆస్పత్రి నుంచి ఏడుగురు డిశ్చార్జ్

మహిళల సింగిల్ ఫెవరేట్లలో ఒకరిగా సింధు అడుగు పెట్టబోతున్నారు. తొలి రౌండ్ లో బై పొందిన సింధు..మంగళవారం జరిగే రెండోరౌండ్ లో స్లోవేకియా ప్లేయర్ మార్టినా రెపిస్కాతో ఆడనున్నారు. ఈమెపై గెలిస్తే…సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్ లో ప్రపంచ 10వ ర్యాంకర్ పోర్న్ పవీ చోచువోంగ్ తో ఆడాల్సి రావచ్చని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా సింధు గెలిస్తే…క్వార్టర్ ఫైనల్ లో టాప్ సీడ్, ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి తై జు యింగ్ రూపంలో సింధుకు క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యే ఛాన్స్ ఉంది.

Read More : Dead Man Gets Vaccine : మే నెలలో చనిపోయిన వ్యక్తికి..డిసెంబర్ లో వ్యాక్సిన్ సెకండ్ డోసు

వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో, ఇండోనేసియా మాస్టర్స్ పోటీల్లో సెమీస్ చేరిన ఈమె…ప్రపంచ టూర్ ఫైనల్స్ లో రన్నరప్ గా నిలిచారు. ఒలింపిక్స్ సెమీస్ లో తైవాన్ క్రీడాకారిణి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల విషయానికి వస్తే…పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, సాయిప్రణీత్, లక్ష్య సేన్, శ్రీకాంత్ బరిలో ఉన్నారు.