WTC Final 2023: తుది జట్టులోకి అశ్విన్‌ను తీసుకోకపోవటానికి కారణమేంటో తెలుసా? కెప్టెన్ రోహిత్ ఏం చెప్పారంటే..

డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అశ్విన్ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెం.1 బౌలర్, ఆల్ రౌండర్ జాబితాలో నెం.2లో ఉన్నాడు.

WTC Final 2023: తుది జట్టులోకి అశ్విన్‌ను తీసుకోకపోవటానికి కారణమేంటో తెలుసా? కెప్టెన్ రోహిత్ ఏం చెప్పారంటే..

WTC Final 2023

Ravichandra Ashwin: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ట్రావిస్ హెడ్ (146), స్టీవ్ స్మిత్ (95) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవటం పట్ల గవాస్కర్, గంగూలీతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. అశ్విన్ ఉండిఉంటే తన స్పిన్ మాయాజాలంతో ఆసీస్ జోరుకు అడ్డుకట్ట వేసేవాడని పలువురు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.

WTC Final 2023 : ముగిసిన తొలి రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోర్.. సెంచరీతో కదంతొక్కిన హెడ్

డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అశ్విన్ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెం.1 బౌలర్, ఆల్ రౌండర్ జాబితాలో నెం.2లో ఉన్నాడు. అయినా తుది జట్టులో ఎందుకు ఎంపిక చేయలేదో కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానం ఇచ్చారు. అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకోకపోవటం చాలా కష్టమైన నిర్ణయమే. అయితే, ఓవల్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే మేము నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంచుకోవాల్సి ఉందని రోహిత్ చెప్పారు.

WTC Final 2023: భారత్ – ఆస్ట్రేలియా ఫైనల్ పోరుకు రెండు పిచ్‌లు సిద్ధం, ఓవల్ మైదానంలో భారీ భద్రత.. ఎందుకో తెలుసా?

గతంలో అశ్విన్ ఎన్నోసార్లు మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచాడు. కానీ జట్టు అవసరాలనుకూడా మనం గుర్తుంచుకోవాలని రోహిత్ చెప్పుకొచ్చారు. ఓవల్ పిచ్ పై పచ్చిక, బౌన్స్ ఉంది. బాల్ స్వింగ్ అవుతుంది. కాబట్టి అదనపు పాస్ట్ బౌలర్ ఉండటం అవసరం ఏర్పడింది. దీంతో అశ్విన్ స్థానంలో శార్దూల్ ను తుది జట్టులోకి తీసుకోవాల్సి వచ్చిందని రోహిత్ తెలిపాడు. అశ్విన్‌ను కాదని జడేజాను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందోకూడా రోహిత్ వివరించాడు. జడేజా గత రెండేళ్లలో బ్యాట్ తో కూడా సత్తాచూపిస్తున్న ఆల్ రౌండర్, బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ పరిస్థితులను బేరీజు వేసుకొని ఓవల్ పిచ్‌కు అశ్విన్ కంటే జడేజానే తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని భావించి జడేజాను తుదిజట్టులోకి తీసుకోవటం జరిగిందని రోహిత్ తెలిపాడు.