డబ్బులు కట్టలేదని టీమిండియాకి సెక్యూర్టీ బంద్

  • Published By: madhu ,Published On : September 18, 2019 / 05:51 AM IST
డబ్బులు కట్టలేదని టీమిండియాకి సెక్యూర్టీ బంద్

తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదని టీమిండియా క్రీడాకారులకు పోలీసులు సెక్యూర్టీ కల్పించలేదు. సకాలంలో బీసీసీఐ డబ్బులు జమ చేయకపోవడంతో చండీగడ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భద్రత లేకుండానే క్రికెటర్లు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ 20, టెస్టు సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలుత టీ 20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ధర్మశాలలో వర్షం పడేసరికి మొదటి టీ 20 మ్యాచ్ జరగలేదు. సెప్టెంబర్ 18వ తేదీన మొహాలీ వేదికగా జరిగే రెండో టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఇందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని చండీగడ్ పోలీసులు భారత క్రీడాకారులకు భద్రత కల్పించాల్సి ఉంది.

కానీ ఎలాంటి సెక్యూర్టీ ఇవ్వకూడదని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. భధ్రతకు రూ. 9 కోట్లు బీసీసీఐ చెల్లించలేకపోవడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రీడాకారులు సేఫ్‌గా హోటళ్లకు చేరుకున్నారు. వీరికి ప్రైవేటు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. 

వచ్చిన అవకాశాలను అంతగా సద్వినియోగం చేసుకోలేకపోతున్న పంత్‌పై అందరి చూపు పడింది. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ప్లేయర్లంగా ఉత్సాహంతో ఉండగా.. కొత్త కెప్టెన్ డి కాక్ సారథ్యంలో టఫ్ ఫైట్ ఇవ్వాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టీ 20 మ్యాచ్‌ల్లో భారత్‌కు పరాజయం ఎదురైంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ్టి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై బోణీ చేస్తుంది. 
Read More : బోణీ కొట్టేనా! : దక్షిణాఫ్రికా – భారత్ రెండో టీ 20 మ్యాచ్