IPL 2021 : ఇక ఇంటికే, ఐపీఎల్ నుంచి తప్పుకున్న గేల్

స్టార్ ఆటగాడు పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి వీడనున్నాడు. బుయో బబుల్ తో విసిగిపోయిన గేల్..ఐపీఎల్ (IPL) ను వదిలి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.

IPL 2021 : ఇక ఇంటికే, ఐపీఎల్ నుంచి తప్పుకున్న గేల్

Ipl 2021

Chris Gayle Bubble Fatigue : క్రిస్ గేల్..అనగానే ముందుగా గుర్తొచ్చొది విధ్వంసకరమైన బ్యాటింగ్. బౌలర్ ఎవరా అని చూడగాకుండా..బ్యాట్ తో బంతులను సిక్స్ లు, ఫోర్లుగా మలుస్తుంటాడు. ఇతని బ్యాటింగ్ చూడాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేయగల నైపుణ్యం ఉంది. ప్రత్యర్థి బౌలర్ ఎంత నిప్పులు చెరిగే బంతులు వేసినా..సరే..గేల్ మాత్రం అలవోకగా సిక్స్ బాదుతాడు. గేల్ కొట్టిన భారీ సిక్స్ కు స్కోర్ కార్డు డిస్ ప్లే చేసే స్క్రీన్ గ్లాస్ పగిలిపోయిన సంగతి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.

Read More : Tammareddy : పవన్ కళ్యాణ్ స్పీచ్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈ విండీస్ వీరుడు..గ్రౌండ లోపల, బయట ఫుల్ జోష్ లో కనిపిస్తుంటాడు. ధనాధన్ క్రికెట్ లో విధ్వంసానికి గేల్ మారు పేరు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫాంలో ఉన్నాడంటే..ప్రత్యర్థులకు చుక్కలే. ఇలాంటి స్టార్ ఆటగాడు పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి వీడనున్నాడు. బుయో బబుల్ తో విసిగిపోయిన గేల్..ఐపీఎల్ (IPL) ను వదిలి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. ఈ విషయం…పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తెలిపింది. రెండో దశ ఐపీఎల్ మ్యాచ్ లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Read More : Petrol Diesel Price : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? వివరాలు

రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. కరీబియన్ ప్రిమియర్ లీగ్ లో ఆడిన గేల్…నేరుగా ఐపీఎల్ ఆడేందుకు వచ్చాడు. వచ్చే నెలలో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల సంరక్షణ కోసం బయో బబుల్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా నెలలుగా బబుల్ ఉంటున్నా..టీ 20 ప్రపంచకప్ సమయానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నాడు గేల్.