Petrol Diesel Price : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? వివరాలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు నిలకడనేది లేకుండా అయిపొయింది. నిత్యం ఫ్యూయల్ రేట్లు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై భారం పడుతోంది.

Petrol Diesel Price : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? వివరాలు

Petrol

Petrol Diesel Price : ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరాయి. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలో పెట్రోలు ధర లీటరుకు 26 పైసలు పెరిగి 106రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటరు ధర 33 పైసలు పెరిగి రూ.98.39 అయింది. మూడు వారాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పెట్రోలు ధరలు పెరిగాయి. దేశంలోని మెట్రో నగరాల్లోకల్లా ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. విలువ ఆధారిత పన్నులు, వ్యాట్ కారణంగా ఇంధన రేట్లు రాష్ట్రాల వారీగా మారుతూ ఉన్నాయి. కాగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి అమలు చేస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే

Read More : BiggBoss 5 : బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్.. అతన్ని ఎందుకు చేసారంటూ ఫైర్..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 98.39గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.45గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.80గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.22గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.50గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.14గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.08గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.48 ఉండగా.. డీజిల్ ధర రూ.98.84గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.95 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.33గా ఉంది.

Read More : Telangana : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, హరితహారంపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.20 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.05 లకు లభిస్తోంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.35 ఉండగా.. డీజిల్ ధర రూ. 99.21గా ఉంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.33లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.14గా ఉంది.
కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.89గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.76గా ఉంది.
గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.20 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.100.05లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.89 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.17 లకు లభిస్తోంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.95కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.84గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.47 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.27 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.58 ఉండగా.. డీజిల్ ధర రూ.94.74గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.44 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.70గా ఉంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.74 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.35గా ఉంది.